Share News

రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్

ABN , Publish Date - Jul 07 , 2026 | 06:27 PM

గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసినా.. జొమాటో ఆర్డర్‌ ద్వారా ఫుడ్ డెలివరీ చేసినా.. తెచ్చిన బాయ్‌కు ఎంతో కొంత చేతిలో పెడతాం. అయితే ఓ మహిళ కేవలం రూ.15 విలువైన వస్తువు ఆర్డర్‌ చేసింది. దానిని తెచ్చిన డెలివరీ బాయ్‌కు రూ.500 టిప్పుగా ఇచ్చింది.

రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసినా.. జొమాటో ఆర్డర్‌ ద్వారా ఫుడ్ డెలివరీ చేసినా.. తెచ్చిన బాయ్‌కు ఎంతో కొంత చేతిలో పెడతాం. అయితే ఓ మహిళ కేవలం రూ.15 విలువైన వస్తువు ఆర్డర్‌ చేసింది. దానిని తెచ్చిన డెలివరీ బాయ్‌కు రూ.500 టిప్పుగా ఇచ్చింది. దీంతో అతడు ఆనందంతో ఉబ్బితబ్బి అయిపోతున్నాడు. ‘ఐ యామ్ బ్లింక్‌ఇట్ రైడర్’ అనే డెలివరీ బాయ్ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్‌గా మారింది.


టిప్ గురించి వీడియోలో అతడు ఇలా అన్నాడు.. ‘అది కేవలం రూ.15 ఆర్డర్ మాత్రమే. ఆ దీదీ నాకు ఎంత టిప్పు ఇచ్చారో మీకు తెలుసా? ఆమె నాకు ఏకంగా రూ.500 ఇచ్చారు. చాలా ధన్యవాదాలు దీదీ. నేను సాధారణంగా ఒక్క రోజులో ఇంత సంపాదించను’ అని చెప్పాడు. ఈ వీడియో వైరల్ కావడంతో.. నెటిజన్లు స్పందిస్తున్నారు.


వస్తువు విలువ రూ.15 అయినా.. రూ.500 అయినా.. డెలివరీ బాయ్ తరచుగా ఇంటికి తీసుకు వస్తాడు. కానీ మనం అతడికి ధన్యవాదాలు చెప్పడం అలా ఉంచి.. కనీసం తాగడానికి మంచి నీళ్లు కూడా ఇవ్వడం మర్చిపోతాం. ఓ మహిళ ఇలా చేయడం నిజంగా గ్రేట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. డెలివరీ బాయ్ కష్టాల్లో ఉన్నాడని ఆమె గుర్తించి ఉంటుంది. అందుకే అలా చేసిందని మరో నెటిజన్ పేర్కొన్నారు. ఆ డెలివరీ బాయ్‌కు, కస్టమర్‌కు భవిష్యత్తులో మంచి జరగాలని మరికొందరు కోరుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌లో ఫోన్ భద్రతపై విదేశీయురాలి వ్యాఖ్యలు.. వీడియో వైరల్

బొమ్మలా పరుగులు తీస్తున్న రెయిన్ ట్రైన్.. వీడియో వైరల్

For More Viral News And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 07:18 PM