జీవిత సత్యం చెప్పిన తాతయ్య.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 07 , 2026 | 07:06 PM
సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని దృశ్యాలు నేరుగా హృదయాన్ని తాకుతాయి. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాంటి ఘటనే ఇది. వివరాల్లోకెళితే...
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని దృశ్యాలు నేరుగా హృదయాన్ని తాకుతాయి. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇంకొన్ని మాత్రం ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసేలా ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆత్మగౌరవం గురించి ఓ వృద్ధుడు చెప్పిన విషయం అందరి హృదయాలను కదిలింపజేస్తోంది. దీంతో ఆ వృద్ధుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ ప్రపంచంలో అత్యధిక శాతం మంది ప్రజలు.. తమ కడుపు నింపుకోవడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ కొందరు మాత్రం నీతి, నిజాయతీ అంటూ ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపుతారు. ఈ వీడియోలో కనిపిస్తున్న సదరు వృద్ధుడి వయసు 79 ఏళ్లు. భిక్షాటన చేసుకునే కంటే.. కష్టపడి పని చేయడం మేలని ఆయన అంటున్నారు. బతుకు బండి నడవాలంటే.. కష్టపాడాల్సిందేనని చెప్పిన ఆయన మాటలు మంచి ప్రేరణనిస్తున్నాయి.
రైలులో ప్రయాణిస్తున్న సహచర ప్రయాణికుడు అడిగిన ప్రశ్నలకు వృద్ధుడు పైవిధంగా సమాధానమిచ్చారు. వంకాయలు విక్రయించి తాను జీవనం సాగిస్తానని వివరించారు. భిక్షాటన కంటే ఇలా కష్టపడి పని చేయడమంటేనే తనకు ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వీడియోను 'patna4u_' అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
ఈ వీడియోను లక్షలాది వీక్షించగా, సుమారు ఐదు లక్షల మంది లైక్ చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. వృద్ధుడు హృదయాలను గెలుచుకున్నాడని పలువురు కామెంట్ చేస్తున్నారు. పెద్దాయనకు హృదయపూర్వక వందనాలు అని మరికొందరు కొనియాడారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్
బొమ్మలా పరుగులు తీస్తున్న రెయిన్ ట్రైన్.. వీడియో వైరల్
For More Viral News And Telugu News