సెల్‌ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుగులో రైల్వేట్రాక్‌పై ప్రయాణికుల నడక.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 08 , 2026 | 03:58 PM
ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే ట్రాక్‌లూ నీటమునిగాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో నడిచే లోకల్ రైల్ సర్వీసులను అధికారులు రద్దు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే ట్రాక్‌లూ నీటమునిగాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో నడిచే లోకల్ రైల్ సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటిలో మునిగిన రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తున్న ఓ నెట్టింట వీడియో వైరల్‌గా మారింది. కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా.. విరార్ నుంచి చర్చిగేట్ వరకు నడిచే లోకల్ రైల్ దెబ్బతింది. దీంతో రైళ్లను రద్దు చేశారు. అయితే జులై 7 తర్వాత వర్షాలు తగ్గాయి. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. కొన్ని గంటల్లోనే మళ్లీ భారీ వర్షాలు కురవడంతో రైళ్లను నిలిపేశారు అధికారులు.
ఉదయం ఆఫీస్, ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ప్రజలు.. చర్చిగేట్‌లో రైలెక్కి వసాయి రైల్వే స్టేషన్ చేరుకున్నారు. అక్కడి నుంచి విరార్, నాలా సోపారా వైపు వెళ్లే రైళ్లు రద్దయ్యాయి. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆటో, ట్యాక్సీలో వెళ్లదామంటే.. డ్రైవర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తుండంతో రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తున్నారు. మెబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుగులో జలమయమైన రైల్వే ట్రాక్‌పై కాలినడక ప్రయాణం సాగిస్తున్నారు.
దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే యంత్రాంగం కొత్త ఏసీ రైళ్లను నడిపేందుకు కోట్లాది రూపాయిలు ఖర్చు చేస్తోందని, కానీ వర్షాకాలంలో రైల్వే ట్రాక్‌పై నిలిచిన నీటిని తొలగించేందుకు మాత్రం చర్యలు చేపట్టడం లేదని పెదవి విరిచారు. వర్షాకాలం వస్తుందని తెలిసినా.. ముందస్తు చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రయాణికులు కూడా రైల్వే అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రైలు ఆపి సమోసాలు కొన్న లోకో పైలట్.. వీడియో వైరల్
రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్
For More Viral News And Telugu News