Share News

300 రూట్‌లో 3-4 నిమిషాలకో బస్సు!

ABN , Publish Date - Jul 10 , 2026 | 11:18 AM

ప్రయాణికులు అధికంగా ప్రయాణించే బస్‌ రూట్లపై గ్రేటర్‌ ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

300 రూట్‌లో 3-4 నిమిషాలకో బస్సు!
Hyderabad City Buses

  • 107 బస్సులు 428కి పైగా ట్రిప్పులు

  • రోజూ 60-70 వేల మంది ప్రయాణం

  • మెట్రోఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల ట్రిప్పులు పెంచే దిశగా ఆర్టీసీ ప్రణాళికలు

హైదరాబాద్‌ సిటీ: ప్రయాణికులు అధికంగా ప్రయాణించే బస్‌ రూట్లపై గ్రేటర్‌ ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. 300 రూట్‌ (అరాంఘర్‌, మెహిదీపట్నం - ఉప్పల్‌)లో ప్రతీ రోజూ 107 ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సులు నడుస్తున్నాయి. ఈ రూట్‌లో ఆర్టీసీ రోజూ 428కి పైగా బస్‌ ట్రిప్పులు నడుపుతుండగా 60-70 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ అధికంగా పెరుగుతున్న రూట్లపై దృష్టిసారించిన గ్రేటర్‌జోన్‌ అధికారులు ఈ రూట్‌ మరిన్ని ట్రిప్పులు పెంచడంతో పాటు ప్రతి 3-4 నిమిషాలకు ఓ బస్సు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.


city6.3.jpgఉప్పల్‌ - మెహిదీపట్నం, ఆరాంఘర్‌ రూట్‌లో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సర్వీసులు నడుపుతున్నారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణాలతో మహిళల రద్దీ అధికంగా పెరిగిన రూట్లలో సర్వేలు నిర్వహిస్తూ బస్‌ ట్రిప్పులు పెంచేదిశగా చర్యలు చేపడుతున్నట్టు ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రద్దీ రూట్లలో ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తూ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్‌ట్రిప్పులు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బస్సులు ఒకేసారి క్యూలో రాకుండా రద్దీ బస్టాపుల్లో బస్సుల నిర్వహణకు సూపర్‌వైజర్లను నియమిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:\

వీడియో కాల్‌ ఉచ్చులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

ట్రాఫిక్‌ సిగ్నళ్ల నిర్వహణకు రూ.77.31 కోట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 10 , 2026 | 11:18 AM