Share News

ట్రాఫిక్‌ సిగ్నళ్ల నిర్వహణకు రూ.77.31 కోట్లు

ABN , Publish Date - Jul 10 , 2026 | 09:57 AM

హైదరాబాద్‌లోని ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థను మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.77.31 కోట్లకు పరిపాలనా అనుమతి మంజూరు చేసింది.

ట్రాఫిక్‌ సిగ్నళ్ల నిర్వహణకు రూ.77.31 కోట్లు
Hyderabad traffic signals

  • కొత్త సిగ్నళ్ల ఏర్పాటుకు పరిపాలనా అనుమతి

హైదరాబాద్‌ సిటీ: నగరంలోని ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థను మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.77.31 కోట్లకు పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న 404 ట్రాఫిక్‌, పెలికన్‌ సిగ్నళ్ల నిర్వహణతో పాటు కొత్త ట్రాఫిక్‌ సిగ్నళ్ల సరఫరా, ఏర్పాటు, పరీక్షలు, కమిషనింగ్‌ పనులను మూడేళ్లపాటు చేపట్టేందుకు ఈ నిధులు వినియోగించనున్నారు. ఈ మేరకు మెట్రోపాలిటన్‌ ఏరియా అండ్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ శాఖ జి.ఓ.ఆర్‌.టి. నెం.671ను గురువారం జారీ చేసింది.


city2.2.jpgమూడేళ్ల నిర్వహణకు టెండర్లు

జీఎచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ప్రస్తుతం అమలవుతున్న ట్రాఫిక్‌ సిగ్నళ్ల నిర్వహణ ఒప్పందం ముగియనున్న నేపథ్యంలో కొత్త నిర్వహణ సంస్థ ఎంపిక కోసం ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మొత్తం రూ.77,31,51,504లు (జీఎ్‌సటీతో కలిపి) వ్యయంతో పనులను ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా టెండర్లు పిలిచి చేపట్టాలని ఆదేశించింది. కొత్త ఒప్పందం ద్వారా నగరంలోని 404 ట్రాఫిక్‌, పెలికన్‌ సిగ్నళ్లు 24 గంటలూ నిరంతరాయంగా పనిచేసేలా నిర్వహణ చేపట్టనున్నారు.


కమాండ్‌ కంట్రోల్‌తో అనుసంధానం

ట్రాఫిక్‌ సిగ్నళ్లను నగరంలోని మూడు పోలీస్‌ కమిషనరేట్ల కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ కేంద్రాలతో అనుసంధానించి, కంట్రోల్‌ రూమ్‌ల నిర్వహణ బాధ్యతలను కూడా కాంట్రాక్టు సంస్థ నిర్వహించనుంది. సాంకేతిక, ఆర్థిక ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించి అత్యుత్తమ సంస్థను ఎంపిక చేయాలని జీఎచ్‌ఎంసీ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా పారదర్శక, పోటీ విధానంలో టెండర్లను నిర్వహించాలని స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎక్కడ ‘సర్‌’.. మీ చిరునామా?

కడియంకు దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 10 , 2026 | 09:57 AM