గురుగ్రామ్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు గ్యాంగ్‌స్టర్ల మృతి
ABN , Publish Date - Jul 10 , 2026 | 08:50 AM
గురుగ్రామ్‌లో (హర్యానా) గురువారం సాయంత్రం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు మరణించారు.
ఇంటర్నెట్ డెస్క్: గురుగ్రామ్‌లో (హర్యానా) గురువారం సాయంత్రం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు మరణించారు. స్థానికంగా ఒక వ్యాపారి ఇంటి ముందు గ్యాంగ్‌స్టర్లు కాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎస్‌యూవీలో కొందరు సాయుధులైన వ్యక్తులు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు సమాచారం వచ్చింది. దీంతో, పోలీసులు సుశాంత్ లోక్ ఫేజ్-2 ప్రాంతంలో గాలింపు చర్యలు ప్రారంభించారు.
ఈ క్రమంలో వ్యాపారి ఇంటిముందు గ్యాంగ్‌స్టర్లు అత్యాధునిక తుపాకీతో కాల్పులు ప్రారంభించారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు మరణించగా ఒక క్రిమినల్ గాయపడ్డాడు. ముగ్గురు పోలీసులకు కూడా తూటా గాయాలయ్యాయి. కొద్ది రోజులుగా ఆ వ్యాపారికి విదేశీ గ్యాంగ్‌ల నుంచి బెదిరింపులు వస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు.
ఈ ఉదంతంలో కాల్పులకు తెగబడ్డ వారి వివరాలు, వారి నేర చరిత్ర గురించి త్వరలో వెల్లడిస్తామని పోలీసు శాఖ ప్రతినిధి తెలిపారు. ఘటనా స్థలంలో ఫారెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారని అన్నారు. నిందితుల నుంచి ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
హుండీ నుంచి స్టాక్స్‌లోకి.. రాముడి సొమ్ముతో లాభాల వేట
ఇథనాల్‌తో వాహనాలకు నష్టం కలగదు: గడ్కరీ