ఇథనాల్‌తో మైలేజీకి దెబ్బే
ABN , Publish Date - Jul 10 , 2026 | 05:45 AM
పెట్రోల్, డీజిల్‌లో ఇథనాల్ (ఈ-20) శాతం మరింతగా పెంచితే వాహనాలు దెబ్బతింటాయని దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో...
అయితే వాహనాలకు నష్టం కలగదు: గడ్కరీ
న్యూఢిల్లీ, జూలై 9: పెట్రోల్, డీజిల్‌లో ఇథనాల్ (ఈ-20) శాతం మరింతగా పెంచితే వాహనాలు దెబ్బతింటాయని దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై కేంద్ర రోడ్డురవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా స్పందించారు. ఇథనాల్ కలోరిఫిక్ వాల్యూ పెట్రోల్ కంటే తక్కువగా ఉంటుందని.. ఇంధనంలో ఇథనాల్ శాతం పెరిగితే.. వాహనాల మైలేజీ కాస్త తగ్గే అవకాశం ఉందని ఆయన అంగీకరించారు. అయితే అధిక ఇథనాల్ బ్లెండ్ వాడుతున్న వాహనాలను పరిశీలించినప్పుడు.. మైలేజీ తగ్గడం పరిమితమేనని, వాహనాలకు నష్టమేమీ ఉండదని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం ఏటా రూ.2 లక్షల కోట్ల విలువ చేసే శిలాజ ఇంధనాలను (పెట్రోలియం, బొగ్గు, సహజవాయువు) దిగుమతి చేసుకుంటున్నామని.. దేశంలో అత్యధిక కాలుష్యం వాటి వాడకం వల్లే వస్తోందని.. ఈ దిగుమతులను తగ్గించడానికి స్వదేశీ ఇంధనాల వినియోగం ఒక్కటే మార్గమని తేల్చిచెప్పారు. ఇథనాల్ వినియోగంతో వాహనాలు డ్యామేజ్ అవుతాయంటూ సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారని.. తప్పుడు ప్రచారం కుట్రలో ఇది భాగమని విమర్శించారు. ఈ-20 ఇంధన వినియోగంతో దెబ్బతిన్న కారును ఒక్కదానినైనా తనకు చూపించాల న్నారు. బ్రెజిల్‌లో 1970 నుంచి 27ు ఇథనాల్-పెట్రోల్ బ్లెండ్ వాడుతున్నారని తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం.. చమురు దిగుమతులకు ప్రత్యామ్నాయాలు అన్వేషించాలని సూచిస్తోందని ఆయన చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
రోజంతా నిలకడగా రాణించి, చివరికి లాభాల్లోనే ముగిసిన సూచీలు
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..