హుండీ నుంచి స్టాక్స్‌లోకి.. రాముడి సొమ్ముతో లాభాల వేట
ABN , Publish Date - Jul 10 , 2026 | 05:49 AM
అయోధ్య రామాలయంలో హుండీల నుంచి కాజేసిన విరాళాల సొమ్ము, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులుగా మళ్లిన విషయం వెలుగు చూసింది....
ముందుగా స్నేహితులు, బంధువుల ఖాతాల్లో జమ
తర్వాత నిందితుల ఖాతాలకు బదిలీ
లఖ్‌నవూ, న్యూఢిల్లీ, జూలై 9: అయోధ్య రామాలయంలో హుండీల నుంచి కాజేసిన విరాళాల సొమ్ము, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులుగా మళ్లిన విషయం వెలుగు చూసింది. దోచుకున్న డబ్బు మూలాలు తెలియకుండా ఉండేందుకు నిందితులు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు బయటపడింది. ఆలయం నుంచి రహస్యంగా తరలించిన డబ్బును ముందుగా బంధువులు, స్నేహితుల ఖాతాల్లో జమ చేసి, తర్వాత తమ ఖాతాలకు ఆ మొత్తాన్ని బదిలీ చేయించుకున్నారు. నేరుగా తమ ఖాతాల్లోనే జమ చేసుకుంటే దొరికిపోతామన్న భయంతో ఈ ఎత్తుగడను అనుసరించినట్టు తెలుస్తోంది. కోర్టు అనుమతితో ముగ్గురు నిందితులు.. అనుకూల్ మిశ్రా, లవ్‌కుష్ మిశ్రా, కరుణేశ్ పాండేను పోలీసులు విచారించినప్పుడు ఈ విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా విరాళాల సొమ్ములో కొంత మొత్తాన్ని స్టాక్స్‌లోకి, ఇతర ఆర్థిక సాధనాల్లోకి మళ్లించినట్టు దర్యాప్తు అధికారులు భావిస్తూ, నిందితులు, వారి బంధువులు, స్నేహితులకు సంబంధించి 30 బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. కాగా, విరాళాల చోరీ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసిన వీహెచ్‌పీ వైస్ ప్రెసిడెంట్ చంపత్ రాయ్.. ఆలయానికి సంబంధించి ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (ఎస్‌వోపీ) మాజీ సభ్యుడు మిశ్రా ఎస్‌బీఐతో కలసి రూపొందించినట్టు సిట్‌కు రాసిన లేఖలో పర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
రోజంతా నిలకడగా రాణించి, చివరికి లాభాల్లోనే ముగిసిన సూచీలు
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..