Share News

కేతన్ హత్య ఘటన.. ఈ జంట చేసిన పనికి అందరూ షాక్..

ABN , Publish Date - Jul 10 , 2026 | 10:40 AM

కేతన్ హత్య ఘటనతో ట్రెక్కింగ్‌కు వెళ్లే జంటలు ఆలోచనలో పడిపోయాయి. ఒకరకంగా చెప్పాలంటే జంటల్లో అభద్రతాభావం నెలకొంది. ఇందుకు తాజాగా జరిగిన సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.

కేతన్ హత్య ఘటన.. ఈ జంట చేసిన పనికి అందరూ షాక్..
Viral Trekking Video,

ఇంటర్‌నెట్ డెస్క్: పుణెకు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరీ సాయంతో లోనావాలాలోని లోహగడ్ కోట దగ్గర కేతన్‌ను లోయలోకి తోసి చంపేసింది. ప్రమాదవశాత్తు అతడు కిందపడి చనిపోయాడని అందరికీ చెప్పింది. అయితే, పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. సియా, చేతన్‌లు అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు.


జంటల్లో భయం..

కేతన్ హత్య ఘటనతో ట్రెక్కింగ్‌కు వెళ్లే జంటలు ఆలోచనలో పడిపోయాయి. ఒకరకంగా చెప్పాలంటే జంటల్లో అభద్రతాభావం నెలకొంది. ఇందుకు తాజాగా జరిగిన సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన భార్యాభర్తలు దుపట్టా సాయంతో ఒకరి చేతిని మరొకరి చేతితో కట్టేసుకున్నారు. చేతులు కట్టేసుకుని కొండపై ట్రెక్కింగ్ చేస్తున్న వారిని చూసి అక్కడి జనం షాక్ అయ్యారు. ఓ వ్యక్తి వారిని వీడియో తీయటమే కాకుండా.. ‘ఎందుకలా చేతులు కట్టేసుకున్నారు’ అని అడిగాడు. భద్రత కోసం అలా చేసినట్లు వారు చెప్పారు.


ఆ వ్యక్తి భార్యాభర్తల వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వైరల్ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆఖరికి కట్టుకున్న భార్యనైనా నమ్మడానికి భయపడే పరిస్థితి వచ్చింది’..‘చేతన్ మర్డర్ కేసు తర్వాత పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ఒకరిపై ఒకరికి నమ్మకం పోయింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

వీడియో కాల్‌ ఉచ్చులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

ఈ తేదీల్లో పుట్టినవారిది రాజసమైన వ్యక్తిత్వం..!

Updated Date - Jul 10 , 2026 | 10:48 AM