Share News

మంత్రి నారాయణపై మార్ఫింగ్ ప్రచారం.. వైసీపీపై రూప్ కుమార్ తీవ్ర విమర్శలు

ABN , Publish Date - Jul 10 , 2026 | 10:58 AM

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ నేత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రశేఖర్ ఏం చెబితే అదే కాకాణి మాట్లాడుతున్నారన్నారు.

మంత్రి నారాయణపై మార్ఫింగ్ ప్రచారం.. వైసీపీపై రూప్ కుమార్ తీవ్ర విమర్శలు
Roop Kumar Yadav

నెల్లూరు, జులై 10: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ నేత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీపై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రశేఖర్ ఏం చెబితే అదే కాకాణి మాట్లాడుతున్నారన్నారు. చంద్రశేఖర్ రెడ్డికి రాజకీయ అనుభవం లేదన్నది మరోసారి రుజువైందని వ్యాఖ్యానించారు. SIR ప్రక్రియపై వైసీపీ చేస్తోన్న ఆరోపణలను రుజువు చేయగలరా అని ప్రశ్నించారు.


ఏ ఒక్క ఓటర్ కూడా మిస్ కాకూడదని అధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలిచ్చారని రూప్ కుమార్ తెలిపారు. మార్ఫింగ్ వాయిస్‌లు తీసుకొచ్చి మంత్రిపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఎన్నిక కూడా చేయని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అవగాహనా రాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. నెల్లూరు నగరంలో ఇప్పటికే 72 శాతం డిజిటలైజేషన్ పూర్తయినప్పటికీ, కేవలం 40 శాతం మాత్రమే జరిగిందంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి నారాయణ అవినీతి చేసే వ్యక్తి కాదన్నది నెల్లూరు ప్రజలకి తెలుసన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో SIR సర్వే నిష్పక్షపాతంగా జరుగుతోందని తెలిపారు. మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ ద్వారా వంద శాతం ఎన్యూమరేషన్, డిజిటలైజేషన్ కావాలని ఆదేశాలు ఇచ్చారని రూప్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

కొరియాలో ఆరో రోజు మంత్రి నారా లోకేశ్ పర్యటన.. ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం

తిరుపతిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వ్యక్తి మృతి.. దుర్వాసనతో వెలుగులోకి ఘటన

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 10 , 2026 | 11:12 AM