తిరుపతిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వ్యక్తి మృతి.. దుర్వాసనతో వెలుగులోకి ఘటన
ABN , Publish Date - Jul 10 , 2026 | 10:06 AM
తిరుపతి నగరంలోని తిరుచానూరు చైతన్యపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో వ్యక్తి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది.
తిరుపతి, జులై 10: తిరుపతి నగరంలోని తిరుచానూరు చైతన్యపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో వ్యక్తి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం గంగపాలెం గ్రామానికి చెందిన వెంకటరెడ్డి(38)గా పోలీసులు గుర్తించారు. వెంకటరెడ్డి మేస్త్రీగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు స్వగ్రామానికి వెళ్లడంతో గత పది రోజులుగా ఆయన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఇంటికి తాళం వేసి ఉండగా లోపలి నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వ్యక్తం చేసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని తాళం తెరిచి లోపలికి వెళ్లగా వెంకటరెడ్డి మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెంకటరెడ్డి మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. వెంకటరెడ్డి మృతి సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
అరుదైన మైలురాయిని అందుకున్న అక్షర్ పటేల్
కొరియాలో ఆరో రోజు మంత్రి నారా లోకేశ్ పర్యటన.. ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం
Read Latest AP News And Telugu News