Share News

ఈనెల 20లోపు సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలపై స్పష్టత ఇవ్వాల్సిందే: కవిత

ABN , Publish Date - Jul 10 , 2026 | 09:33 AM

తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మణుగూరులో పర్యటించారు. రెండో విడత ‘బాయిబాట’ రెండో రోజు పర్యటనలో భాగంగా మణుగూరు సింగరేణి పీకే ఓసీపీ-2ను సందర్శించారు.

ఈనెల 20లోపు సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలపై స్పష్టత ఇవ్వాల్సిందే: కవిత
Kalvakuntla Kavitha

భద్రాద్రి కొత్తగూడెం, జులై 10: తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మణుగూరులో పర్యటన కొనసాగుతోంది. రెండో విడత ‘బాయిబాట’ రెండో రోజు పర్యటనలో భాగంగా మణుగూరు సింగరేణి పీకే ఓసీపీ-2(PK OCP)ను సందర్శించారు. ఫస్ట్ షిఫ్ట్ కార్మికులతో మాట్లాడేందుకు కవిత ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం కవితను సింగరేణి అధికారులు అనుమతించడంతో కార్మికులతో మాట్లాడారు. ఈ నెల 20 తేదీన నిరవధిక నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలిపారు.


డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ కోసం మెడికల్ బోర్డ్ ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు. డిపెండెంట్ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల హక్కు అని అన్నారు. అలియాస్ పేర్లు ఉన్న వారి నుంచి అఫిడవిట్లు తీసుకుని పేర్లు మార్చాలన్నారు. సింగరేణి బకాయిలు రూ.50 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో మూడు వేల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. నెలకు రెండు సార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలన్నారు. 20 తేదీ లోపు డిపెండెంట్ ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇస్తే దీక్ష విరమణ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం హామీ ఇవ్వకుంటే గాంధేయ మార్గంలో నిరాహార దీక్ష చేయనున్నట్లు కవిత ప్రకటించారు.


ఇవి కూడా చదవండి...

ఎక్కడ ‘సర్‌’.. మీ చిరునామా?

అరుదైన మైలురాయిని అందుకున్న అక్షర్ పటేల్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 10 , 2026 | 09:39 AM