Share News

ఒంటరిగా ఉంటా తోడుగా రండి..!!

ABN , Publish Date - Jul 10 , 2026 | 05:09 AM

నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ మార్క్‌ పోలోనియస్‌ వికృత చేష్టలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తన లైంగికవాంఛ తీరిస్తేనే టీసీ(ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌) ఇస్తానని..

ఒంటరిగా ఉంటా తోడుగా రండి..!!

  • మద్యం, బిర్యానీ ఆశ చూపి యువకులకు ఎర

  • అర్ధరాత్రి తర్వాత వారిపై లైంగిక వేధింపులు

  • సహకరించకుంటే పరీక్షల్లో ఫెయిల్‌ చేస్తానంటూ బెదిరింపులు

  • విద్యార్థులతో కొల్లాపూర్‌ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ వికృత చేష్టలు

  • ఆయన బాధితుల్లో మరో ఏడుగురు ?

నాగర్‌కర్నూల్‌, జూలై 9(ఆంధ్రజ్యోతి): నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ మార్క్‌ పోలోనియస్‌ వికృత చేష్టలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తన లైంగికవాంఛ తీరిస్తేనే టీసీ(ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌) ఇస్తానని పోలోనియస్‌ ఓ విద్యార్థిని బెదిరించగా.. సదరు యువకుడు ప్రిన్సిపాల్‌ మర్మాంగాన్ని కొరికేశాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనతో పోలోనియ్‌సలోని వికృత కోణం బయటకు వచ్చింది. ఇంట్లో ఒంటరిగా ఉంటా తోడుగా రమ్మని పిలిచి.. మద్యం, బిర్యానీ పార్టీతో విద్యార్థులకు ఎరవేసి, మార్కుల పేరిట బెదిరించి పోలోనియస్‌ తన లైంగిక వాంఛలు తీర్చుకునే వాడని తెలిసింది. పోలోనియస్‌ బాధితుల్లో మరో ఏడుగురు విద్యార్థులు ఉన్నారని సమాచారం. కొల్లాపూర్‌ పీజీ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న 403 మంది విద్యార్థుల్లో పెళ్లి కాని విద్యార్థులనే పోలోనియస్‌ టార్గెట్‌ చేసినట్టు తెలుస్తోంది. కొల్లాపూర్‌ పట్టణంలోని బండాయగుట్టలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న పోలోనియస్‌.. పీజీ విద్యార్థులను తరచూ తన ఇంటికి ఆహ్వానించేవారు. వారికి మద్యంతో పాటు చికెన్‌ బిర్యానీ పెట్టేవాడని.. అర్ధరాత్రి సమయంలో తమ మర్మాంగాలను తాకుతూ తన లైంగిక వాంఛ తీర్చాలని, లేదంటే పరీక్షల్లో ఫెయిల్‌ చేస్తానని బెదిరించేవాడని ఓ విద్యార్థి వాపోయారు. విద్యార్థి మర్మాంగాన్ని కొరకడంతో తీవ్రంగా గాయపడిన పోలోనియస్‌ను మెరుగైన చికిత్స కోసం బుధవారం రాత్రి హైదరాబాద్‌కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాత పోలోనియ్‌సను న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉంది. కాగా, కొల్లాపూర్‌ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ వ్యవహారంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతున్నట్టు తెలిసింది.

Updated Date - Jul 10 , 2026 | 07:28 AM