అరుదైన మైలురాయిని అందుకున్న అక్షర్ పటేల్
ABN , Publish Date - Jul 10 , 2026 | 08:10 AM
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో మరో అద్భుతమైన మైలురాయిని అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ ద్వారా ఈ 31 ఏళ్ల గుజరాత్ ఆల్‌రౌండర్ తన వందో (100) అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ను పూర్తి చేసుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో మరో అద్భుతమైన మైలురాయిని అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ ద్వారా ఈ 31 ఏళ్ల గుజరాత్ ఆల్‌రౌండర్ తన వందో (100) అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ను పూర్తి చేసుకున్నాడు. భారత క్రికెట్ జట్టు తరఫున 100 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల మైలురాయిని అందుకుంటానని తాను ఎప్పుడూ ఊహించలేదని అక్షర్ పటేల్ అన్నాడు. ఈ అరుదైన ఘనతను సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, కుటుంబ సభ్యులకు అంకితం ఇస్తున్నట్లు అక్షర్ వెల్లడించాడు.
బీసీసీఐ విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో అక్షర్ తన 11 ఏళ్ల క్రికెట్ ప్రయాణాన్ని వివరించాడు. ‘నేను తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైనప్పుడు వంద మ్యాచ్‌లు ఆడతానని ఊహించలేదు. ఈ ఇంగ్లండ్ పర్యటన నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సిరీస్‌లోనే టి20ల్లో వంద వికెట్‌ల మైలురాయిని దాటాను. ఇప్పుడు వంద టి20 మ్యాచ్‌ల మరో మైలురాయిని కూడా అందుకున్నాడు. ఇది నాకెంతో ప్రత్యేకమైన రోజు. ఈ మైలురాయిని చేరుకోవడం కేవలం నా ఒక్కడి కృషి కాదు, జట్టు సభ్యులు, కోచ్‌లకు ఇందులో భాగస్వామ్యం ఉంది. టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్ అయినా ఆడాలనేది ప్రతి ప్లేయర్ కల. అలాంటిది వంద మ్యాచ్‌లు అంటే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను’ అని అక్షర్ వెల్లడించాడు.
‘ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ... మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉంటాను. నా మొదటి మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరం ఇక మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా సాధన చేస్తున్నారు. ఏ ఆటగాడైనా తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నప్పుడే మరింత మెరుగవుతాడు’ అని అక్షర్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి: