Share News

స్పెయిన్‌ను నిలువరించేనా?

ABN , Publish Date - Jul 10 , 2026 | 05:15 AM

అజేయ ఆటతీరుతో దూసుకెళ్తున్న స్పెయిన్‌ ఓ వైపు.. ప్రత్యర్థి జట్ల నుంచి సవాళ్లు ఎదురైనా పోరాట పటిమతో ముందుకు సాగుతున్న బెల్జియం మరోవైపు.. ఈ రెండు జట్ల మధ్య...

స్పెయిన్‌ను నిలువరించేనా?

అర్ధరాత్రి 12.30 నుంచి

యునైటైడ్‌ 8 స్పోర్ట్స్‌లో..

బెల్జియంపైనే ఒత్తిడి

నేడు రెండో క్వార్టర్‌ఫైనల్‌

ఫిఫా ప్రపంచకప్‌

లాస్‌ఏంజిల్స్‌: అజేయ ఆటతీరుతో దూసుకెళ్తున్న స్పెయిన్‌ ఓ వైపు.. ప్రత్యర్థి జట్ల నుంచి సవాళ్లు ఎదురైనా పోరాట పటిమతో ముందుకు సాగుతున్న బెల్జియం మరోవైపు.. ఈ రెండు జట్ల మధ్య శుక్రవారం అర్ధరాత్రి రెండో క్వార్టర్స్‌ జరుగబోతోంది. తాజా వరల్డ్‌క్‌పలో ఫేవరెట్‌గా భావిస్తున్న స్పెయిన్‌ అంచనాలకు తగ్గట్టుగానే చెలరేగుతోంది. ఇప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్లకు ఒక్క గోల్‌ కూడా ఇవ్వకపోవడం విశేషం. ది గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ స్పెయిన్‌గా పేరు తెచ్చుకున్న గోల్‌కీపర్‌ ఉనై సిమోన్‌ జట్టు ప్రధాన ఆయుధంగా మారాడు. ప్రపంచకప్‌ చరిత్రలోనే 609 నిమిషాలపాటు ప్రత్యర్థి జట్లకు గోల్‌ చేసే అవకాశం ఇవ్వకుండా రికార్డు నెలకొల్పాడు. నేటి క్వార్టర్స్‌లోనూ బెల్జియంకు అతనే అడ్డంకి కానున్నాడు. అలాగే బెల్జియంతో ఆడిన చివరి 11 మ్యాచ్‌ల్లో స్పెయిన్‌కు ఓటమనేదే లేదు. ఇక ఫిఫా వరల్డ్‌క్‌పలో 36 ఏళ్ల తర్వాత ఇరు జట్లు తలపడబోతున్నాయి. గతంలో రెండుసార్లు పోటీపడగా 1-1తో సమంగా ఉన్నాయి. నాకౌట్‌లో ఆస్ట్రియా, పోర్చుగల్‌ను స్పెయిన్‌ ఇంటిముఖం పట్టించింది. అటు బెల్జియం ప్రదర్శన తడబడుతూ సాగినా కివీ్‌సపై 5-1 తేడాతో గ్రూప్‌ టాపర్‌గా నాకౌట్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత సెనెగల్‌, అమెరికాలపై ఘనవిజయాలతో ఇప్పుడు సెమీస్‌ బెర్త్‌పై కన్నేసింది.

ఇవీ చదవండి:

వరుస ఓటములకు బ్రేక్ పడేనా? బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే!

గొప్ప కెప్టెన్‌ అవుతాడు.. శ్రేయస్‌కు మద్దతుగా నిలిచిన సోదరి శ్రేష్ఠ

Updated Date - Jul 10 , 2026 | 05:15 AM