Share News

వరుస ఓటములకు బ్రేక్ పడేనా? బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే!

ABN , Publish Date - Jul 09 , 2026 | 05:36 PM

శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు గురువారం ఇంగ్లండ్‌తో నాల్గో టీ20 పోరుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సిరీస్‌ను కాపాడుకునేందుకు తుది జట్టులో కొన్ని కీలక మార్పులు చేసేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

వరుస ఓటములకు బ్రేక్ పడేనా? బరిలోకి దిగే భారత తుది జట్టు  ఇదే!
India Playing XI vs England 4th T20

స్పోర్ట్స్ డెస్క్: శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు గురువారం ఇంగ్లండ్‌తో నాల్గో టీ20 పోరుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా, తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 2-0 ఆధిక్యంలో ఉంది. ముఖ్యంగా మూడో టీ20లో టీమిండియా కేవలం 76 పరుగులకే కుప్పకూలి, 125 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. కనీసం ఒక్క బ్యాటర్ కూడా 15 పరుగుల మార్కును దాటలేకపోవడం జట్టు బ్యాటింగ్ వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో సిరీస్‌ను కాపాడుకునేందుకు తుది జట్టులో కొన్ని కీలక మార్పులు చేసేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.


ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆకట్టుకోలేకపోయిన తిలక్ వర్మ (13, 24*, 3 పరుగులు) స్థానంలో అనుభవజ్ఞుడైన సంజూ శాంసన్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడించే యోచనలో టీమిండియా మేనేజ్‌మెంట్ ఉందని సమాచారం. ఓపెనర్లుగా అభిషేక్ శర్మతో పాటు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అవకాశం అందుకోనున్నాడు. వైభవ్ గత రెండు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు చేయకపోయినా (14, 13 పరుగులు), అతని హిట్టింగ్ సామర్థ్యంపై నమ్మకం ఉంచారు. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మూడో స్థానంలో, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాల్గో స్థానంలో బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది.


ఆల్‌రౌండర్ల విభాగంలో శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణాలు తమ స్థానాలను నిలబెట్టుకోనున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో పేసర్లుగా అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ బాధ్యతలు పంచుకోనుండగా, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి జట్టులో కొనసాగే అవకాశం ఉందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బ్యాటింగ్ పటిష్ఠతను పెంచుకుని, వరుస ఓటములకు అడ్డుకట్ట వేయాలని భారత్ పట్టుదలగా ఉంది.


భారత తుది జట్టు (అంచనా):

అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సంజూ శాంసన్/తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.


ఇవి కూడా చదవండి:

ఈజిప్ట్ ఆరోపణలను కొట్టిపారేసిన ఫిఫా రిఫరీయింగ్ చీఫ్

గొప్ప కెప్టెన్‌ అవుతాడు.. శ్రేయస్‌కు మద్దతుగా నిలిచిన సోదరి శ్రేష్ఠ

Updated Date - Jul 09 , 2026 | 05:54 PM