న్యూజిలాండ్ పర్యటనకు మోదీ.. లక్సన్ కీలక ప్రకటన
ABN , Publish Date - Jul 09 , 2026 | 05:07 PM
భారత ప్రధాని నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటనకు ఒక రోజు ముందే ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ కీలక ప్రకటన చేశారు. భారత్‌తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడంతో న్యూజిలాండ్ నుంచి భారత్‌కు జరిగే ఎగుమతుల్లో 57 శాతం ఉత్పత్తులకు తొలిరోజే దిగుమతి సుంకం ఉండదని వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటనకు ఒక రోజు ముందే ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ కీలక ప్రకటన చేశారు. భారత్‌తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA) అమల్లోకి రావడంతో న్యూజిలాండ్ నుంచి భారత్‌కు జరిగే ఎగుమతుల్లో 57 శాతం ఉత్పత్తులకు తొలిరోజే దిగుమతి సుంకం రద్దుచేస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఒప్పందంతో న్యూజిలాండ్ వాణిజ్యదారులకు భారీ ప్రయోజనం చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు.
కాగా.. జులై 10న ప్రధాని మోదీ ఆక్లాండ్‌కు చేరుకోనున్నారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా పర్యటనల అనంతరం ఆయన మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరగా న్యూజిలాండ్‌ను సందర్శించనున్నారు. 40 ఏళ్లలో భారత ప్రధాని అధికారికంగా న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్, న్యూజిలాండ్‌లు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ డీల్‌తో ఆ దేశం నుంచి భారత్‌కు వచ్చే 95 శాతం వస్తువులపై సుంకాలను దశలవారీగా తొలగించాలి. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలు మరింత బలోపేతమయ్యే అవకాశముంది. 2024-25 ఆర్థిక ఏడాదిలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 1.3 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. 2024లో ఇది 2.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇందులో ప్రయాణం, సమాచార సాంకేతిక సేవలు, వ్యాపార రంగాలు కీలక పాత్ర పోషించాయి. మోదీ-లక్సన్ సమావేశంలో.. వాణిజ్యం, పెట్టుబడులు, సముద్ర భద్రత, విద్య, సాంకేతికత, పర్యాటకం, క్రీడలు వంటి అంతర్జాతీయ అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. భారత 'యాక్ట్ ఈస్ట్' విధానం, 'మహాసాగర్(మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్‌మెంట్ ఫర్ సెక్యూరిటీ అక్రాస్ ద రీజియన్స్)' దృష్టికోణం సహా స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ ప్రాంత నిర్మాణానికి ఈ పర్యటన మరింత ఉపయుక్తం కానుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి:
మెల్‌బోర్న్‌లో మోదీకి ఘన స్వాగతం.. మార్వెల్ స్టేడియం 'హౌస్‌ఫుల్'
అక్రమ భవనాలు, నిర్మాణాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు