Share News

ఈజిప్ట్ ఆరోపణలను కొట్టిపారేసిన ఫిఫా రిఫరీయింగ్ చీఫ్

ABN , Publish Date - Jul 09 , 2026 | 04:40 PM

ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా అర్జెంటీనా, ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా రిఫరీలపై వచ్చిన ఆరోపణలపై ఫిఫా రిఫరింగ్ చీఫ్ పీర్‌లూయిగి కొలినా స్పందించారు.

ఈజిప్ట్ ఆరోపణలను కొట్టిపారేసిన ఫిఫా రిఫరీయింగ్ చీఫ్
FIFA World Cup 2026

స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా అర్జెంటీనా, ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఈజిప్ట్ తొలి అర్ధలో 2-0 ఆధిక్యంలో నిలిచినప్పటికీ, అర్జెంటీనా అద్భుతంగా పుంజుకుని 3-2 తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే, ఇంజూరీ టైమ్‌లో ఎంజో ఫెర్నాండెజ్ కొట్టిన విన్నింగ్ గోల్‌తో ఈజిప్ట్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమిపై ఈజిప్ట్ ఫుట్‌బాల్ అసోసియేషన్, కోచ్ హోసామ్ హసన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రిఫరీ నిర్ణయాలు అర్జెంటీనాకు అనుకూలంగా ఉన్నాయని, వారిని టోర్నీలో ఉంచడానికే ఒత్తిడికి లొంగి పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు.


ఈ ఆరోపణలపై ఫిఫా రిఫరింగ్ చీఫ్ పీర్‌లూయిగి కొలినా ఇవాళ( గురువారం) స్పందించారు. మ్యాచుల విషయంలో అంఫైర్ల నిర్ణయాలు పూర్తిగా స్వతంత్రమైనవని, వారి చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరని స్పష్టం చేశారు. 'ఫుట్‌బాల్‌లో నిర్ణయాలపై చర్చ సహజం. కానీ నిరాధారమైన ఆరోపణలు చేయడం సరైనది కాదు. ఫిఫా అధ్యక్షుడే స్వయంగా చెప్పినా రిఫరీల నిర్ణయాలను ప్రభావితం చేయలేరు' అని కొలినా తేల్చిచెప్పారు.


వీఏఆర్ రివ్యూలో అర్జెంటీనా డిఫెండర్ లిసాండ్రో మార్టినెజ్‌పై ఈజిప్ట్ ఆటగాడు ఫౌల్ చేసినట్లు స్పష్టంగా తేలిందని, అందుకే ఆ గోల్‌ను రద్దు చేశామని ఆయన పేర్కొన్నారు. అలాగే సలా విషయంలో జరిగింది సాధారణ ఫుట్‌బాల్ కాంటాక్ట్ మాత్రమేనని, అక్కడ ఫౌల్ లేదని పేర్కొన్నారు. ఇలాంటి నిరాధార ఆరోపణల కారణంగా రిఫరీలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి:

గొప్ప కెప్టెన్‌ అవుతాడు.. శ్రేయస్‌కు మద్దతుగా నిలిచిన సోదరి శ్రేష్ఠ

ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లోకి గిల్ సహచరుడు

Updated Date - Jul 09 , 2026 | 05:24 PM