ఎల్‌నినోపై సర్కార్ అప్రమత్తం.. ఎదుర్కొనేందుకు సిద్ధమన్న మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Jul 09 , 2026 | 04:08 PM
ఎల్‌నినో ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా జిల్లాల వారీగా కార్యాచరణకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, జులై 9: ఎల్‌నినో ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈరోజు(గురువారం) సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా జిల్లాల వారీగా కార్యాచరణకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. ప్రతి పరిస్థితినీ ప్రభుత్వం పర్యవేక్షిస్తోందన్నారు. గ్రామసభల ద్వారా ఎల్‌నినోపై చైతన్యం కల్పిస్తామన్నారు. శాస్త్రవేత్తల సూచనలతో పంటల ఎంపిక చేసుకోవాలని, ప్రతి రైతుకు సాంకేతిక సలహాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
రిజర్వాయర్ల నీటి లభ్యతపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు మంత్రి తెలిపారు. సాగునీటి వినియోగం శాస్త్రీయంగా నిర్వహిస్తామన్నారు. ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో నిరంతరం సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. వదంతులను నమ్మొద్దని.. అధికారుల సూచనలు పాటించాలని రైతులకు సూచించారు. ఎల్‌నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వర్చువల్‌గా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి...
2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: సీఎం రేవంత్
మూసీ పునరుజ్జీవన పనులకు గ్రీన్ సిగ్నల్.. రూ.7,345 కోట్ల ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం
Read Latest Telangana News And Telugu News