లార్డ్స్‌లో చారిత్రక ఘట్టం
ABN , Publish Date - Jul 10 , 2026 | 05:19 AM
ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. పురుషుల తొట్టతొలి టెస్ట్ మ్యాచ్ జరిగిన 142 ఏళ్ల తర్వాత.. మొట్టమొదటిసారిగా మహిళల టెస్ట్‌కు లార్డ్...
తొలిసారి మహిళల టెస్ట్‌కు ఆతిథ్యం
ఏకైక మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్ ఢీ నేటినుంచి
లండన్: ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. పురుషుల తొట్టతొలి టెస్ట్ మ్యాచ్ జరిగిన 142 ఏళ్ల తర్వాత.. మొట్టమొదటిసారిగా మహిళల టెస్ట్‌కు లార్డ్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. శుక్రవారం నుంచి ఇంగ్లండ్-భారత్ మహిళల జట్ల మధ్య జరిగే ఏకైక టెస్ట్‌తో సరికొత్త అధ్యాయానికి తెరలేవనుంది. టీ20 వరల్డ్‌క్‌పలో గ్రూప్ దశలోనే అవుటైన భారత్.. ఆ చేదు జ్ఞాపకాలను మరిచి బలంగా పుంజుకోవాలనుకొంటోంది. ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో ఏకైక టెస్ట్ తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడుతున్న భారత్‌కు రెండో మ్యాచ్ ఇది. కాగా, ఇంగ్లండ్‌తో ఆడిన గత నాలుగు టెస్టుల్లో భారత్ మూడు నెగ్గడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. ఐకానిక్ టెస్ట్ కావడంతో హర్మన్‌ప్రీత్ సేన ఎంతో ఉత్సుకతతో ఉంది. ముఖ్యంగా అరంగేట్రం ప్లేయర్లు హర్లిన్ డియోల్, స్పిన్నర్ శ్రీచరణి, పేసర్ నందిని శర్మకు చిరస్మరణీయ జ్ఞాపకం. స్మృతి మంధాన, షఫాలీ వర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రతీకా రావల్ గాయపడడంతో.. ఆమె స్థానంలో ప్రియా పూనియా మూడో నెంబర్‌లో బ్యాటింగ్ చేయనుంది. మిడిలార్డర్‌లో జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్, యాస్తిక భాటియా, ఆల్‌రౌండ్ దీప్తి శర్మ రాణించాల్సి ఉంది. రేణుక ఠాకూర్, నందిని శర్మ, క్రాంతి గౌడ్ పేస్ భారాన్ని మోయనున్నారు. మరోవైపు పొట్టికప్ ఫైనల్లో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్.. చారిత్రక టెస్ట్‌లో విజయంతో ఆ బాధను మరిచిపోవాలని భావిస్తోంది. క్యాప్సీ, టిల్లే కోర్టిన్-కోల్మన్, మ్యాడీ విల్లియర్స్, గ్రేస్ పాట్, ఎల్లీలకు ఇదే తొలిటెస్ట్ కాగా.. ఓపెనర్ టామీ బ్యూమాంట్‌కు ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఎకిల్‌స్టోన్, లారెన్ బెల్ జట్టులో కీలక సభ్యులు.
ప్రతి ఒక్కరి కల
లార్డ్స్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడడం.. భారత జట్టుకు అద్భుత ఘట్టం. ఈ మ్యాచ్‌లో విజయం.. టీ20 వరల్డ్‌కప్ ఓటమిని మరిపించడమే కాదు, మహిళల క్రికెట్‌లో మాకు ఓ గొప్ప మైలురాయి అవుతుంది. లార్డ్స్‌లో ఆడాలన్నది నా చిన్ననాటి కల. ఇప్పుడు అది నెరవేరుతుండడంతో చాలా సంతోషంగా ఉంది.
హర్మన్‌ప్రీత్
ఇవీ చదవండి:
వరుస ఓటములకు బ్రేక్ పడేనా? బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే!
గొప్ప కెప్టెన్ అవుతాడు.. శ్రేయస్‌కు మద్దతుగా నిలిచిన సోదరి శ్రేష్ఠ