Share News

జైళ్లలో సంస్కరణలకు తీసుకున్న చర్యలేమిటి?

ABN , Publish Date - Jul 10 , 2026 | 05:15 AM

జైళ్లలో చేపట్టాల్సిన సంస్కరణల విషయంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని..

జైళ్లలో సంస్కరణలకు తీసుకున్న చర్యలేమిటి?

  • సుప్రీంకోర్టు ఆదేశాల అమలుపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు

అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): జైళ్లలో చేపట్టాల్సిన సంస్కరణల విషయంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆదేశాల అమలు పురోగతిపై తదుపరి విచారణ నాటికి స్థాయి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లీసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది.

వీధి కుక్కల బెడదపై ఏంచేశారు?

వీధి కుక్కల బెడద నివారణకు ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆదేశాల అమలు పురోగతిపై తదుపరి విచారణ నాటికి స్థాయి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. పిటిషన్‌పై తదుపరి విచారణను ఆగస్టు 7కి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లీసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది.

Updated Date - Jul 10 , 2026 | 05:16 AM