‘మావిగన్ అంటే మామిడి పండు అనుకుంటున్నారామో’.. జగన్‌పై చింతా మోహన్ సెటైర్
ABN , Publish Date - Jul 10 , 2026 | 11:24 AM
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మావిగన్‌పై కేంద్రమాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావిగన్ అంటే మామిడి పండు అని అనుకుంటున్నారని జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
విశాఖపట్నం, జులై 10: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మావిగన్‌పై కేంద్రమాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. మావిగన్ అంటే మామిడి పండు అని అనుకుంటున్నారని జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వచ్చే ఎన్నికల్లో ఇదే అంశంపై జగన్ వెళ్తారంటే అయ్యే పనికాదన్నారు. ఒకే ఒక్క ఛాన్స్ అని జగన్ అడిగితే ప్రజలు ఇచ్చారని.. ఇక ఆయనకు ఎటువంటి ఛాన్స్ ఇవ్వరని వ్యాఖ్యానించారు. జగన్ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని.. ఏదో ఊహించుకొని మాట్లాడుతున్నారని అన్నారు.
జగన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు 11 ఉన్నాయని.. ఎన్నికల ముందు జైలుకు వెళ్తారా? లేదా? అనేది ముందు తెలుసుకోవాలని కేంద్రమాజీ మంత్రి హితవుపలికారు. జయలలితకు ఒక న్యాయం? జగన్‌కు ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. ‘జగన్ మావిగన్ అంటే నేను తిరుపతి అంటాను.. రాజధానిని రాయలసీమలో పెట్టమని అంటాను’ అంటూ చింతా మోహన్ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
తిరుపతిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వ్యక్తి మృతి.. దుర్వాసనతో వెలుగులోకి ఘటన
మంత్రి నారాయణపై మార్ఫింగ్ ప్రచారం.. వైసీపీపై రూప్ కుమార్ తీవ్ర విమర్శలు
Read Latest AP News And Telugu News