తిరుపతిలో మద్యం మత్తులో కారు డ్రైవింగ్.. యువకుల హల్‌చల్
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:29 PM
తిరుపతి జిల్లా కపిలతీర్థం సర్కిల్ దగ్గర ఈరోజు (మంగళవారం) వేకువజామున 4 గంటల ప్రాంతంలో కర్ణాటక రిజిస్ట్రేషన్ (KA01 NJ 6858) కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తూ ఓ వ్యక్తిని నల్లరంగులోని ఓ కారు ఢీకొట్టింది.
తిరుపతి జిల్లా, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా కపిలతీర్థం సర్కిల్ దగ్గర ఈరోజు (మంగళవారం) వేకువజామున 4 గంటల ప్రాంతంలో కర్ణాటక రిజిస్ట్రేషన్ (KA01 NJ 6858) కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తూ ఓ వ్యక్తిని నల్లరంగులోని ఓ కారు ఢీకొట్టింది. ఈ వాహనంలోని డ్రైవర్, మరొకరు మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు ఆరోపించారు. ఈ ప్రమాదం తర్వాత కారు దిగకుండా లోపలే యువకులు కూర్చున్నారు. వాహనం నంబర్ ప్లేట్‌తో పాటు నిందితుల ముఖాలను వీడియోలు తీసి స్థానికులు నిలదీశారు.
ఈ వాహనం అక్కడి నుంచి వేగంగా పోనిచ్చేందుకు డ్రైవర్ యత్నించడంతో స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కారు నంబర్ అధారంగా ఇద్దరిని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మద్యం మత్తులో కారు నడిపిన యువకుడిని శ్రీకాళహస్తి రూరల్ మండలం పోలి భీమవరానికి చెందిన సిద్దార్థగా గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
జగన్‌కు లోకేశ్ మాస్ కౌంటర్.. లెక్కలతో ఫ్యాక్ట్ రిప్లై
రొయ్యల రైతులపై జగన్‌ది కపట ప్రేమ.. మా సర్కారుపై సాక్షిది అసత్య ప్రచారమే.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News