26, 28 తేదీల్లో చెన్నై-తిరుపతి రైళ్ల రద్దు
ABN , Publish Date - Jun 12 , 2026 | 08:50 AM
తమిళనాడులోని అరక్కోణం యార్డ్ విస్తరణ పనుల కారణంగా చెన్నై సెంట్రల్-తిరుపతి సహా 8 రైళ్లను ఈ నెల 26, 28 తేదీల్లో రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే పేర్కొంది.
చెన్నై: అరక్కోణం యార్డ్ విస్తరణ పనుల కారణంగా చెన్నై సెంట్రల్-తిరుపతి సహా 8 రైళ్లను ఈ నెల 26, 28 తేదీల్లో రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.
చెన్నై సెంట్రల్-తిరుపతి ఉదయం 6.30 గంటలు, మధ్యాహ్నం 2.24 గంటల సప్తగిరి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 26,28 తేదీల్లో రద్దు.

చెన్నై సెంట్రల్-తిరుపతి సాయంత్రం 4.35 గంటల రైలు ఈ నెల 26వ తేది, తిరుపతి-చెన్నై సెంట్రల్ ఉదయం 10.10 గంటల రైలు ఈ నెల 26,28 తేదీల్లో రద్దు.
తిరుపతి-చెన్నై సెంట్రల్ ఉదయం సాయంత్రం 6.05గంటల రైలు ఈ నెల 26వ తేది రద్దు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం, వెండి ధరలు.. నేడు ఎలా ఉన్నాయంటే..
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News