నకిలీ ట్రేడింగ్ యాప్‌తో రూ.11.29 లక్షలకు టోకరా
ABN , Publish Date - Jun 12 , 2026 | 07:52 AM
నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా ఓ ఫార్మా ఉద్యోగి నుంచి రూ.11.29 లక్షలు కాజేసిన సైబర్ మోసగాళ్లపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ సిటీ: నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా ఓ ఫార్మా ఉద్యోగి నుంచి రూ.11.29 లక్షలు కాజేసిన సైబర్ మోసగాళ్లపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌లోని హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీలో నివాసముంటున్న బాధితుడు (ఫార్మా ఉద్యోగి)ని ఫిబ్రవరి 2026లో కల్యాణ్ అనే వ్యక్తి సంప్రదించాడు. తాను ఏంజెల్ వన్ సంస్థ ప్రతినిధినని పరిచయం చేసుకుంటూ ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా భారీగా డబ్బు సంపాదించవచ్చని నమ్మించాడు. ఇతర సభ్యులు భారీ లాభాలు పొందినట్లు నకిలీ స్ర్కీన్‌షాట్‌లు పంపించి అతడికి నమ్మకం కల్పించాడు.
దీంతో బాధితుడు ఫిబ్రవరి 26నతొలి విడతగా రూ.29,999 యూపీఐ ఖాతాకు బదిలీ చేశాడు. అనంతరం రూ.2 లక్షలకు పైగా లాభం వచ్చిందని, ఆ మొత్తాన్ని విడుదల చేయాలంటే ముందుగా 40 శాతం కమీషన్ చెల్లించాలని మోసగాళ్లు కోరారు. వారి మాటలు నమ్మిన బాధితుడు మే 26న మరో రూ.80 వేల రూపాయలను పంపించాడు. కమీషన్ ఒకే లావాదేవీలో చెల్లించలేదని, అందువల్ల విత్‌డ్రాయల్ నిలిచిపోయాయని చెబుతూ మరింత నగదు బదిలీ చేయాలని ఒత్తిడి చేశారు.
ఈ క్రమంలో బాధితుడు స్నేహితుల సహాయంతో రూ.4.90 లక్షలు, అనంతరం రూ.5.59 లక్షలు వివిధ యూపీఐ ఖాతాలకు బదిలీ చేశాడు. అయినప్పటికీ డబ్బు విడుదల చేయకుండా మరో రూ.80 వేల మార్జిన్ ఫీజు చెల్లించాలని డిమాండ్ చేయడంతో తాను మోసపోయానని గుర్తించాడు. సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించిన బాధితుడు మొత్తం రూ.11.29 లక్షలు మోసపోయినట్లు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం, వెండి ధరలు.. నేడు ఎలా ఉన్నాయంటే..
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News