Share News

బంగారం, వెండి ధరలు.. నేడు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Jun 12 , 2026 | 06:58 AM

అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో దేశంలో బంగారం ధరలు గత రెండు రోజుల్లో భారీ స్థాయిలో పతనమయ్యాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండి ధరలు.. నేడు ఎలా ఉన్నాయంటే..
Gold, Silver Rates on Jun 12

ఇంటర్నెట్ డెస్క్: యూఎస్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పతాకస్థాయికి చేరిన నేపథ్యంలో పసిడి ధరలు తగ్గుతున్నాయి. గత రెండు రోజులుగా ధరలు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. వెండి ధర కూడా ఓ మోస్తరు స్థాయిలో తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (జూన్ 12) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,45,630 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,33,490గా ఉంది. కిలో వెండి రూ.2,59,900గా ఉంది. విజయవాడలో కూడా ధరలు దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి.


దేశంలోని ఇతర ప్రధాన నగరాల విషయానికి వస్తే చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,47,270గా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,34,990గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,45,630గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,490గా ఉంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,780 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,33,640గా ఉంది. ఇక వివిధ నగరాల్లో కిలో వెండి ధర రూ.2.5 లక్షల నుంచి రూ.2.6 లక్షల మధ్య ఉంది. ఇరాన్‌తో డీల్ కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించడంతో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలనూ చదవండి:

60 నుంచి 90 రోజులకు.. ఇంధన సామర్థ్యం పెంచే యోచనలో కేంద్రం

యూఎస్‌లో విజయవంతమైన వలసదారుల్లో వినోధ్ ఖోస్లా, సుందర్ పిచాయ్

Updated Date - Jun 12 , 2026 | 07:07 AM