Share News

అమెరికాలో విజయవంతమైన వలసదారుల్లో

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:25 AM

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశంలో నివసిస్తున్న విజయవంతమైన 250 మంది వలసదారులతో కూడిన జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో...

అమెరికాలో విజయవంతమైన వలసదారుల్లో

వినోద్‌ ఖోస్లా, సుందర్‌ పిచాయ్‌

250 మందితో జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్‌

వాషింగ్టన్‌: అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశంలో నివసిస్తున్న విజయవంతమైన 250 మంది వలసదారులతో కూడిన జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో భారత సంతతికి చెందిన బిలియనీర్‌ వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ వినోద్‌ ఖోస్లా, ప్రముఖ ఆంత్రప్రెన్యూర్‌, ఇన్వెస్టర్‌ నావల్‌ రవికాంత్‌, సుందర్‌ పిచాయ్‌ తదితరులున్నారు. బహిష్కరణలు, గ్రీన్‌కార్డు నిబంధనలు కఠినతరం చేయడం, విస్తృత స్థాయిలో ఇమ్మిగ్రేషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆపరేషన్స్‌ ద్వారా అమెరికాలోని వలసదారులపై డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాం గం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ జాబితా వెలువడింది. ఇందులో సన్‌మైక్రోసిస్టమ్స్‌ సహ వ్యవస్థాపకుడు వినోద్‌ ఖోస్లా 14వ స్థానంలో ఉండగా.. ఇన్వె్‌స్టమెంట్‌ ప్లాట్‌ఫామ్‌ ఏంజెల్‌లిస్ట్‌ సహ వ్యవస్థాపకుడు నావల్‌ రవికాంత్‌ 27వ స్థానంలో నిలిచారు. జనరల్‌ క్యాటలిస్ట్‌ వ్యవస్థాపకుడు హేమంత్‌ తనేజా 31వ స్థానంలో, మైక్రాన్‌ సీఈవో, సాన్‌డి్‌స్క వ్యవస్థాపకుడు సంజయ్‌ మెహ్రోత్రా 44వ స్థానంలో, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ 55వ స్థానంలో, పద్మ లక్ష్మీ (టాప్‌ చెఫ్‌ హోస్ట్‌) 64వ స్థానంలో, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల 89వ స్థానంలో, ఐబీఎం సీఈవో అరవింద్‌ కృష్ణ 219వ స్థానంలో, అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్‌ 221వ స్థానంలో, పెప్సీకో మాజీ సీఈవో, చైర్మన్‌ ఇంద్రానూయి 248వ స్థానంలో ఉన్నారు. మొత్తంగా 27 మంది టాప్‌ భారత సంతతి వలసదారులకు ఈ జాబితాలో స్థానం లభించింది.

ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: హోంమంత్రి అనిత

ప్రధాని మోదీ దేశాన్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నారు: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And National News

Updated Date - Jun 12 , 2026 | 05:25 AM