Share News

ఇరాన్‌తో డీల్‌ కుదిరిందన్న ట్రంప్.. సంతకాలు కాగానే హోర్ముజ్‌ ఓపెన్‌..

ABN , Publish Date - Jun 12 , 2026 | 06:46 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో యుద్ధం గురించి మరోసారి స్పందించారు. గురువారం ఆయన ఓవల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్‌తో గొప్ప డీల్ కుదిరిందని చెప్పారు.

ఇరాన్‌తో డీల్‌ కుదిరిందన్న ట్రంప్.. సంతకాలు కాగానే హోర్ముజ్‌ ఓపెన్‌..
Trump Iran Deal

ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో యుద్ధం గురించి మరోసారి స్పందించారు. గురువారం ఆయన ఓవల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్‌తో గొప్ప డీల్ కుదిరిందని చెప్పారు. ఇరాన్‌కు ఎప్పటికీ అణ్వాయుధం ఉండకూడదనేదే డీల్‌కు సంబంధించి డాక్యుమెంట్లు ఫైనలైజ్‌ చేసే ప్రక్రియలో ఉన్నామని వెల్లడించారు. మరికొన్ని రోజుల్లో డీల్ ఒప్పందంపై సంతకాలు చేస్తామని, ఒప్పందంపై సంతకాలు కాగానే హోర్ముజ్‌ జలసంధి తెరుచుకుంటుందని అన్నారు.


ట్రంప్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూతో పాటు ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్‌తో మాట్లాడాను. త్వరలో తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్‌తో కూడా మాట్లాడతాను’ అని అన్నారు. రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరటంతో ఇరాన్‌పై దాడులను నిలిపివేస్తూ ట్రంప్ గురువారం సాయంత్రం నిర్ణయం తీసుకున్నారు. అమెరికాతో ఒప్పందం కుదిరినట్లు ఇరాన్‌కు చెందిన అధికారిక మీడియా ‘ఫార్స్ న్యూస్ ఏజెన్సీ’ కూడా వెల్లడించింది.


ఇరాన్‌ నీటి శుద్ధి ప్లాంట్లపై దాడి

డీల్ కుదరటానికి ముందు ఇరాన్‌పై అమెరికా భీకరదాడులు చేసింది. ఇరాన్‌లో వేలమంది సామాన్య ప్రజలకు జీవనాధారమైన డీశాలినేషన్‌ (సముద్ర నీటి శుద్ధి) ప్లాంట్లను అమెరికా ధ్వంసం చేసింది. గురువారం తెల్లవారుజామున ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ సహా అనేక ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో సిరిక్‌ ప్రావిన్స్‌లోని రెండు డీశాలినేషన్‌ ప్లాంట్లు ధ్వంసమయ్యాయి. దీంతో 20 వేల మంది తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు.


ఇవి కూడా చదవండి

ఒమన్‌ తీరంలో నౌకలపై అమెరికా దాడి

గృహిణుల శ్రమ విలువ నెలకు 30 వేల కన్నా ఎక్కువే

Updated Date - Jun 12 , 2026 | 07:20 AM