తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు
ABN , Publish Date - Jun 12 , 2026 | 06:45 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ మీదుగా బాటగంగమ్మ ఆలయ సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
మంగళవారం హుండీ ఆదాయం: రూ.3.51 కోట్లు
బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 86,124
తలనీలాలు సమర్పించినవారు: 41,520
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News