ఆర్ఎస్ఎస్, బీజేపీలను ఎదుర్కొనేది మేమే: రాహుల్
ABN , Publish Date - Jun 12 , 2026 | 06:06 AM
దేశంలో సిద్ధాంతపరంగా విచ్ఛిన్నం కాకుండా నిలబడింది కాంగ్రెస్ మాత్రమేనని, ఆర్‌ఎ్‌సఎ్‌స-బీజేపీలను దీటుగా ఎదుర్కొనగలిగేది తమ పార్టీయేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ..
సిద్ధాంతపరంగా విచ్ఛిన్నం కాకుండా నిలబడింది కాంగ్రెస్ ఒక్కటే
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఇబ్బందుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ: రాహుల్
తృణమూల్ విలీనం వార్తలు అవాస్తవం: కేసీ వేణుగోపాల్
న్యూఢిల్లీ, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): దేశంలో సిద్ధాంతపరంగా విచ్ఛిన్నం కాకుండా నిలబడింది కాంగ్రెస్ మాత్రమేనని, ఆర్‌ఎ్‌సఎ్‌స-బీజేపీలను దీటుగా ఎదుర్కొనగలిగేది తమ పార్టీయేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ సైద్ధాంతిక పటిష్ఠతతో వచ్చే రెండేళ్లలో పార్టీ మరింతగా బలోపేతం అవుతుందని చెప్పారు. టీఎంసీలో రాజకీయ సంక్షోభం, ఎంపీలు, ఎమ్మెల్యేల్లో చాలా మంది వేరుకుంపటి పెట్టుకోవడం నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గురువారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జులు, సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో రాహుల్ మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని.. దానికి అంతర్జాతీయ పరిణామాల కంటే కేంద్ర ప్రభుత్వ విధానాలే ముఖ్య కారణమని ఆరోపించారు. ఈ అంశంపై ప్రధాని స్పందించేలా లోక్‌సభలో ఒత్తిడి తీసుకురావాలన్నారు. కాగా, లోక్‌సభలో డీలిమిటే షన్ బిల్లు వీగిపోవడంతో బీజేపీ అహం దెబ్బతిన్నదని, అందుకే అన్ని పార్టీల నుంచి ఎంపీలను చీల్చే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు.
మోదీ పాలనపై దేశవ్యాప్త ఉద్యమం
మోదీ పాలనపై జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. జూన్ నెలాఖరు నుంచి రెండు, మూడు నెలల పాటు ఈ పోరాటం కొనసాగించాలని పార్టీ నేతలకు సూచించింది. జాతీయ, రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయి వరకు ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. భేటీ అనంతరం పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ వివరాలు వెల్లడించారు. ఇక కాంగ్రె్‌సలో మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ విలీనం అవుతుందన్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి..
పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..
మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..