Share News

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..

ABN , Publish Date - Jun 11 , 2026 | 03:54 PM

ఇరాన్-అమెరికా మధ్య పరస్పర దాడులు జరుగుతున్న నేపథ్యంలో దేశీయ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర 1.7 శాతం పెరిగి 94.68 డాలర్లకు చేరుకుంది.

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..
Stock Market

ఇరాన్-అమెరికా మధ్య పరస్పర దాడులు జరుగుతున్న నేపథ్యంలో దేశీయ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర 1.7 శాతం పెరిగి 94.68 డాలర్లకు చేరుకుంది. దీంతో డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (95.76) బలహీనపడింది. బుధవారం రూ.2124 కోట్ల విలువైన షేర్లను విదేశీ మదుపర్లు విక్రయించారు. ఈ ప్రతికూలతల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలను చవిచూశాయి. (Indian stock market).


గత సెషన్ ముగింపు (73,983)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 300 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ మధ్యాహ్నం సమయంలో కోలుకుని లాభాల్లోకి వచ్చింది. అయితే చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో తిరిగి నష్టాల్లోకి జారుకుంది. చివరకు సెన్సెక్స్ 150 పాయింట్ల నష్టంతో 73,832 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 53 పాయింట్ల నష్టంతో 23,161 వద్ద స్థిరపడింది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో హ్యుందాయ్ మోటార్స్, టొరెంట్ ఫార్మా, వొడాఫోన్ ఐడియా, వేదాంత, ఐసీఐసీఐ బ్యాంక్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). అదానీ ఎనర్జీ, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, పవర్ ఫైనాన్స్, పేటీఎం, సమ్మన్ క్యాపిటల్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 76 పాయింట్లు ఆర్జించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 484 పాయింట్లు నష్టపోయింది.


ఇవి కూడా చదవండి

వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1గా టీమిండియా..

సీబీఎస్ఈ లోపాలు ఎత్తిచూపిన యువకుడికి ఐఐటీ కాన్పుర్‌లో జాక్‌పాట్

Updated Date - Jun 11 , 2026 | 03:54 PM