Share News

వన్డే ర్యాంకింగ్స్‌లో నం.1గా టీమిండియా..

ABN , Publish Date - Jun 11 , 2026 | 01:15 PM

అంతర్జాతీయ క్రికెట్ మండలి పురుషుల క్రికెట్ జట్ల వార్షిక వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో టీమిండియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

వన్డే ర్యాంకింగ్స్‌లో నం.1గా టీమిండియా..
ICC ODI Rankings

స్పోర్ట్స్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన పురుషుల వార్షిక వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. గత మూడేళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని ఐసీసీ ఈ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. అయితే, ఈ ప్రక్రియలో భారత్ రేటింగ్ పాయింట్లు 119 నుంచి 118కి స్వల్పంగా తగ్గాయి.


దీంతో తొలి రెండు స్థానాల్లో ఉన్న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య పాయింట్ల వ్యత్యాసం 8 నుంచి 5 పాయింట్లకు పడిపోయింది. ప్రస్తుతం కివీస్ జట్టు రెండు పాయింట్లను మెరుగుపరుచుకుని 113 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టు ఎలాంటి మార్పు లేకుండా 109 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది.


టాప్-10లో జరిగిన ఏకైక మార్పు ఏమిటంటే.. పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి దక్షిణాఫ్రికా (102) నాలుగో స్థానానికి చేరుకుంది. కాగా, వన్డేలతో పాటు టీ20 ర్యాంకింగ్స్‌లోనూ భారత్ నం.1 స్థానంలోనే కొనసాగుతుండటం విశేషం. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. మహిళల వన్డే , టీ20ఐ జాబితాలు రెండింటిలోనూ ఆస్ట్రేలియా నం. 1 స్థానంలో ఉంది.


ఇవి కూడా చదవండి:

విదేశీ గడ్డపై వైభవ్ విశ్వరూపం.. హాఫ్ సెంచరీ మిస్

బెన్ స్టోక్స్ రిటైర్‌మెంట్ నిర్ణయం తీసుకోవద్దు: ఇంగ్లండ్ మాజీ ప్లేయర్

Updated Date - Jun 11 , 2026 | 02:25 PM