Share News

నాణ్యతా ప్రమాణాలు లేకుండా.. తేజస్‌ ఎంకే1ఏ ఫైటర్‌కు విడిభాగాలు!

ABN , Publish Date - Jun 12 , 2026 | 06:11 AM

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసిన స్వదేశీ యుద్ధ విమానం ‘తేజస్‌ ఎంకే1ఏ’ కోసం సరఫరా అయిన విడిభాగాల సరఫరా నాణ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది. విడిభాగాలకు...

నాణ్యతా ప్రమాణాలు లేకుండా.. తేజస్‌ ఎంకే1ఏ ఫైటర్‌కు విడిభాగాలు!

  • నకిలీ నాణ్యత ధ్రువపత్రాలు ఇచ్చిందంటూ హైదరాబాద్‌ సంస్థ టెక్‌ఏరో డివైజె్‌సపై హాల్‌ ఫిర్యాదు

న్యూఢిల్లీ, జూన్‌ 11: భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసిన స్వదేశీ యుద్ధ విమానం ‘తేజస్‌ ఎంకే1ఏ’ కోసం సరఫరా అయిన విడిభాగాల సరఫరా నాణ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది. విడిభాగాలకు సంబంధించి నకిలీ నాణ్యత ధ్రువపత్రాలను సమర్పించిందంటూ హైదరాబాదీ సంస్థ టెక్‌ ఏరో డివైజె్‌సపై కేసు నమోదైంది. తేజస్‌ ఎంకే1ఏ తయారీ సంస్థ హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) ఫిర్యాదు మేరకు బెంగళూరులోని హాల్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంస్థ సీఈవో ఎం. శివరామప్రసాద్‌పై ఐపీసీలోని 420 (మోసం), 465 (ఫోర్జరీ), 468 (మోసం కోసం తప్పుడు పత్రాలు, ఆధారాల సృష్టి) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. హాల్‌ ఫిర్యాదులోని అంశాల ప్రకారం.. టెక్‌ ఏరో డివైజెస్‌ సంస్థ మార్చి 2022 నుంచి సెప్టెంబరు 2023 మధ్య 18 ఆర్డర్లకు సంబంధించి 172 విడిభాగాలను సరఫరా చేసింది. టెండర్‌ నిబంధనల మేరకు విడిభాగాల నాణ్యతకు సంబంధించి 199 నాణ్యతా పరీక్షల ధ్రువపత్రాలను సమర్పించింది. అయితే నాణ్యత ధ్రువీకరణ తనిఖీల్లో భాగంగా విడిభాగాల దృఢత్వం, బ్రేక్‌ లోడ్‌, నాన్‌ డిస్ట్రక్టివ్‌ టెస్టింగ్‌, మైక్రో స్ట్రక్చర్‌ తదితర పరీక్షల ఒరిజినల్‌ పత్రాలు అందజేయాలని టెక్‌ఏరో డివైజె్‌సను కోరింది. కానీ ఈ సంస్థ ఒరిజినల్‌ పత్రాలను అందజేయలేదు. దీనితో విడిభాగాలకు నాణ్యతా పరీక్షలు చేసినట్టుగా టెక్‌ఏరో డివైజెస్‌ పేర్కొన్న హైదరాబాద్‌ సంస్థ ‘యాక్సిస్‌ ఇన్‌స్పెక్షన్‌ సొల్యూషన్స్‌’ను హాల్‌ సంప్రదించింది. అయితే తాము ఎలాంటి నాణ్యతా పరీక్షలు చేయలేదని, తమ సంస్థ పేరుతో ఫోర్జరీ సంతకాలతో టెక్‌ఏరో డివైజెస్‌ సంస్థ నకిలీ, తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించి ఉంటుందని యాక్సిస్‌ ఇన్‌స్పెక్షన్స్‌ సంస్థ తేల్చిచెప్పింది. దీనిపై చర్యలు చేపట్టిన హాల్‌ 2024 మార్చిలోనే టెక్‌ఏరో డివైజెస్‌ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థ విడిభాగాలేవీ సరఫరా చేయకుండా మూడేళ్ల నిషేధం విధించింది. పూర్తిస్థాయిలో అంతర్గత విచారణ జరిపి, న్యాయ నిపుణుల సలహా తీసుకుని వారం క్రితమే ఏరోస్పేస్‌ డివైజెస్‌ సంస్థపై క్రిమినల్‌ కేసు పెట్టింది. ఈ అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు.. నకిలీ ధ్రువపత్రాలు, ఇతర ఆధారాలను తమకు అందజేయాలని హాల్‌ను కోరారు. కాగా, నకిలీ నాణ్యత ధ్రువపత్రాలను సమర్పించిందంటూ హాల్‌ తమ సంస్థపై మూడేళ్ల నిషేధం వి ధించిందని, అయితే దీనికి సంస్థలోని ఓ ఉద్యోగి ని ర్వాకమే కారణమని టెక్‌ ఏరో డివైజెస్‌ సీఈవో శివరామప్రసాద్‌ పేర్కొన్నారు. నాణ్యతా పరీక్షల వ్యవస్థ ల్లో పలు మార్పులు చేశామని, నిషేధం ఎత్తివేయాలని హాల్‌కు పలుమార్లు ప్రతిపాదనలు కూడా సమర్పించామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..

మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

Updated Date - Jun 12 , 2026 | 06:11 AM