Share News

జగన్‌కు బుర్ర ఉందా..?

ABN , Publish Date - Jun 12 , 2026 | 04:55 AM

జగన్‌ ఈ మధ్య ఆత్మలతో మాట్లాడుతున్నాడు. ఉన్నవి లేనట్లుగా... లేనివి ఉన్నట్లుగా ఊహించుకుని మాట్లాడుతున్నాడు. ఆయనకు బుర్ర ఉందా..

జగన్‌కు బుర్ర ఉందా..?

  • బెంగళూరు నుంచి వస్తాడు.. కథ చెప్పి పోతాడు: అనిత, అనగాని

తిరుపతి, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): ‘జగన్‌ ఈ మధ్య ఆత్మలతో మాట్లాడుతున్నాడు. ఉన్నవి లేనట్లుగా... లేనివి ఉన్నట్లుగా ఊహించుకుని మాట్లాడుతున్నాడు. ఆయనకు బుర్ర ఉందా? వారంలో ఒక రోజు బెంగళూరు నుంచి వస్తాడు.. కథ చెప్పి వెళ్తాడు’ అని మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో లేని వ్యక్తికి అభివృద్ధి ఎలా కనిపిస్తుందని ప్రశ్నించారు. ఆయన అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తిరుపతిలో కూటమి విజయోత్సవ సభ ఏర్పాట్లను గురువారం వారిద్దరూ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఘటనపై జగన్‌ రాజకీయం చేస్తున్నారు.. ఇది కరెక్టు కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో వేగంగా స్పందించి బాధితులకు అండగా నిలబడ్డాయి. మృతుల కుటుంబాలకు రూ.1.72 కోట్ల చొప్పున ఇస్తామని మంత్రి లోకేశ్‌ చెబితే.. ఈయన రూ.కోటి ఇస్తామంటాడు.. ఏది పెద్ద మొత్తమో తెలియదా? వైసీపీ హయాంలో స్టీల్‌ప్లాంట్‌లో 12 మంది మృత్యువాత పడితే ఎవరికైనా ఉద్యోగం ఇచ్చారా.. ప్యాకేజీ ఇచ్చారా? స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 33 ఎకరాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామంటే.. అప్పటి ఐఏఎస్‌ అఽధికారి అడ్డుకోలేదా’ అని నిలదీశారు. యువతకు ఉపాధి కల్పన లక్ష్యంతో మెగా డీఎస్సీ నిర్వహించామన్నారు. రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించామని చెప్పారు. కేంద్రంలో ప్రధాని మోదీ ‘దేశం ప్రథమం’ అనే సిద్ధాంతంతో పనిచేస్తుండగా.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌ ‘రాష్ట్రం ఫస్ట్‌’ లక్ష్యంతో ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని తెలిపారు.

Updated Date - Jun 12 , 2026 | 04:55 AM