త్వరలో అందుబాటులోకి ఆర్టీసీ టూరిజం
ABN , Publish Date - May 16 , 2026 | 10:46 AM
పర్యాటక అభివృద్ధి సంస్థ తరహాలో ఏపీ పీటీడీ టూరిజం త్వరలో అందుబాటులోకి రానుంది. రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీసీ ద్వారా టూరిజం అమలు చేయాలని ప్రకటించారు.
తిరుపతి: పర్యాటక అభివృద్ధి సంస్థ తరహాలో ఏపీ పీటీడీ టూరిజం త్వరలో అందుబాటులోకి రానుంది. రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీసీ ద్వారా టూరిజం అమలు చేయాలని ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణానికి భరోసా ఉంటుందని తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు తిరుపతి జిల్లాతోపాటు పొరుగు జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు, విశేష సందర్శక ప్రాంతాలు, కేంద్రాలను గుర్తించి రూట్‌మ్యా్‌పను సిద్ధం చేశారు.
పర్యాటకులలో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ఆయా దేవాలయాల విశిష్టత, సందర్శకప్రాంతాల ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తూ పెద్ద పెద్ద సూచికబోర్డుల ఏర్పాటుకు ప్రతిపాదించారు. రిలీజియస్ అండ్ పిలిగ్రిమైజ్, ఎకో, హెరిటేజ్ టూరిజంగా విభజించారు. ఏ రకపు బస్సులను, ఏ సమయంలో నడపాలన్న అంశాలపై చర్చించారు. చార్జీలు, టిక్కెట్ బుకింగ్, సిబ్బంది కేటాయింపులపై కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఇలా తిరుపతి కేంద్రంగా నలుదిశలా ఆర్టీసీ ఆధ్వర్యంలో టూరిజం డెవెలప్మెంట్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఆర్టీసీ ప్రతిపాదనలిలా...
కడప జిల్లాలోని గండికోట, ఒంటిమిట్ట రామాలయం, నందలూరు సౌమ్యనాథ ఆలయం, పుష్పగిరి ఆలయాల సందర్శన
తిరుపతిలోని కపిలతీర్థం, సైన్స్ సెంటర్, జూపార్కు, చుట్టుపక్కలున్న శ్రీనివాసమంగాపురం, చంద్రగిరి కోట, వకుళమాత, ముక్కోటి, తిరుచానూరు ఆలయాల సందర్శన
అప్పలాయగుంట, నారాయణవనం, నాగలాపురం, సురుటుపల్లె, కార్వేటినగరం ఆలయాల సందర్శన
గుడిమల్లం, తొండమనాడు, శ్రీకాళహస్తి ఆలయాల సందర్శన
వాకాడులోని తూపిలిపాళెం బీచ్, షార్, పులికాట్ సరస్సు సందర్శన
మాధవమాల, కలంకారి, శ్రీకాళహస్తి ఆలయ సందర్శన.
ఈ వార్తలు కూడా చదవండి:
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం
గోల్డ్, సిల్వర్ రేట్స్ పతనం.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News