రూపాయి పాతాళానికి ఎందుకు పడిపోతోంది?: షర్మిల
ABN , Publish Date - May 16 , 2026 | 06:28 AM
ప్రపంచంలోనే అత్యద్భుత ఆర్థిక వ్యవస్థ భారత్‌లో ఉందంటూ ప్రధాని మోదీ ప్రకటించడాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తప్పుబట్టారు.
అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అత్యద్భుత ఆర్థిక వ్యవస్థ భారత్‌లో ఉందంటూ ప్రధాని మోదీ ప్రకటించడాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తప్పుబట్టారు. అంత అత్యద్భుతమైన ఆర్థిక వ్యవస్థ అయితే... తొలిసారిగా డాలరు విలువ రూ.96ను ఎందుకు దాటిందో ప్రధాని మోదీ చెప్పాలి అని శుక్రవారం డిమాండ్ చేశారు. ‘దీనిని మోదీ అద్భుతమంటారా..! ఒకప్పుడు భారత మిత్రదేశాలు నుంచి తక్కువ ధరకే చమురు కొనుగోలు చేసేది. కాని.. ఇప్పుడు ట్రంప్‌నకు భయపడి ఖరీదైన చమురును కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల 120బిలియన్ డాలర్లకు పైగా విదేశాలకు వెళ్లిపోతున్నాయి. బలమైన ఆర్థిక విధానం మోదీ అమలు చేస్తుంటే రూపాయి విలువ పాతాళానికి ఎందుకు పడిపోతోంది?’ అని షర్మిల నిలదీశారు.