పరారీలో బండి భగీరథ్.. పోలీసుల గాలింపు
ABN , Publish Date - May 16 , 2026 | 09:37 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోక్సో కేసులో భగీరథ్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
హైదరాబాద్, మే 16: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోక్సో కేసులో భగీరథ్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. దీంతో భగీరథ్‌ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాలిక స్టేట్‌మెంట్ ఇప్పటికే పోలీసులు రికార్డు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు మేజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి స్టేట్‌మెంట్‌ను మరోసారి రికార్డు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం భగీరథ్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
భగీరథ్‌పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో మే 8న పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బాలిక ఫిర్యాదు మేరకు నమోదైన ఈ కేసులో లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో విచారణ నిమిత్తం రావాల్సిందిగా భగీరథ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల విచారణకు భగీరథ్ గైర్హాజరయ్యారు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని, పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. భగీరథ్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
ఆ వార్తలో నిజమే లేదు.. ఎక్స్ వేదికగా ఖండించిన ప్రధాని మోదీ
రైలు ఢీకొడుతున్నా.. ప్రాణాలకు తెగించి పిల్లలను రక్షించిన తల్లి! వీడియో వైరల్
Read Latest Telangana News And Telugu News