నేషనల్ డెంగ్యూ డే 2026.. ఈ 5 లక్షణాలను అసలు నిర్లక్ష్యం చేయొద్దు
ABN , Publish Date - May 16 , 2026 | 08:14 AM
ప్రస్తుతం దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం ప్రాధాన్యం మరింత పెరిగింది. దోమల ద్వారా వ్యాపించే ఈ వైరల్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ 5 లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి సంవత్సరం మే 16న జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. డెంగ్యూపై ప్రజల్లో అవగాహన పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ప్రస్తుతం డెంగ్యూ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో దీని లక్షణాలు, నివారణ మార్గాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఈ 5 లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..
డెంగ్యూ వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు
డెంగ్యూ లక్షణాలను అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించడం మంచిది.
అధిక జ్వరం: అకస్మాత్తుగా ఎక్కువ జ్వరం రావడం డెంగ్యూ ప్రధాన లక్షణాల్లో ఒకటి.
తీవ్రమైన తలనొప్పి: తల బాగా నొప్పిగా ఉండటం, బరువుగా అనిపించడం కనిపించవచ్చు.
కీళ్ల, కండరాల నొప్పులు: శరీరం మొత్తం నొప్పిగా ఉండటం, ముఖ్యంగా కీళ్ల దగ్గర నొప్పి ఎక్కువగా ఉండొచ్చు.
కళ్ల వెనుక నొప్పి: కళ్లను కదిలించినప్పుడు లేదా చూసేటప్పుడు నొప్పి అనిపించవచ్చు.
వికారం, వాంతులు: కొంతమందిలో వాంతులు, వికారం, బలహీనత వంటి సమస్యలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో కళ్లు లేదా చర్మం పసుపు రంగులోకి మారడం కూడా కనిపించవచ్చు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
కూలర్లు, టైర్లు, పూలకుండీల్లో నీరు నిల్వకుండా చూడాలి.
కిటికీలు, తలుపులకు దోమల వలలు అమర్చాలి.
దోమల నివారణ క్రీములు లేదా స్ప్రేలు ఉపయోగించాలి.
బయట ఆహారం కంటే ఇంటి ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలి.
శరీరంలో నీరు తగ్గకుండా ఎక్కువ ద్రవాలు తీసుకోవాలి.
జాగ్రత్త
డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే స్వయంగా మందులు వాడకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా జ్వరం, బలహీనత ఎక్కువగా ఉంటే పరీక్షలు చేయించుకోవడం అవసరం.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
బంగాళదుంపలు త్వరగా ఉడకాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి
మా ప్లేయర్ల పరువుకు భంగం కలిగిస్తే సహించేది లేదు: ప్రీతి జింటా
For More Latest News