పిల్లలకు ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువైతే ఆస్తమా ముప్పు!
ABN , Publish Date - May 15 , 2026 | 01:52 PM
పిల్లల్లో చిప్స్, బర్గర్లు, ఇన్‌స్టంట్ నూడుల్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం పెరుగుతోంది. అయితే ఇవి కేవలం జీర్ణ సమస్యలకే కాదు, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలకు కూడా కారణమయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి కాలంలో పిల్లలు.. చిప్స్, బర్గర్లు, ప్యాక్ చేసిన స్నాక్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే ఈ అలవాటు పిల్లల ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల జీర్ణసమస్యలు వస్తాయని అంటున్నారు. అంతేకాకుండా ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలకు కూడా కారణమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రాసెస్ చేసిన ఆహారం ఎందుకు ప్రమాదకరం?
చిప్స్, పిజ్జా, బర్గర్లు, ఇన్‌స్టంట్ నూడుల్స్, చక్కెర ఎక్కువగా ఉండే ప్యాక్‌డ్ ఫుడ్స్ వంటి వాటిలో రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రంగులు ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లల పేగుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గడం, శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం, ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు రావచ్చు. అలాగే పిల్లల్లో ఆస్తమా వచ్చే ప్రమాదం కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పిల్లలు ఎంత ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం తింటే, ఆరోగ్య సమస్యల ముప్పు అంత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
పిల్లలకు ఏ ఆహారం మంచిది?
పిల్లల ఆరోగ్యానికి ఈ ఆహారాలు మంచివని నిపుణులు సూచిస్తున్నారు:
తాజా పండ్లు, కూరగాయలు
ఇంట్లో తయారుచేసిన ఆహారం
పప్పులు, పాలు, ప్రోటీన్ పదార్థాలు
తక్కువ చక్కెర ఉన్న ఆహారం
పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తగ్గాలంటే ప్యాక్‌డ్, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించి, సహజమైన ఆహారపు అలవాట్లు పెంచాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
బంగాళదుంపలు త్వరగా ఉడకాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి
మా ప్లేయర్ల పరువుకు భంగం కలిగిస్తే సహించేది లేదు: ప్రీతి జింటా
For More Latest News