గోల్డ్, సిల్వర్ రేట్స్ పతనం.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - May 16 , 2026 | 06:47 AM
డాలర్ బలపడటం, యూఎస్ డెట్ సెక్యూరిటీలపై రాబడులు పెరగడంతో భారత్‌లో బంగారం, వెండి ధరలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బంగారం, వెండి ధరలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. యూఎస్ డెట్ సెక్యూరిటీలపై రాబడులు పెరగడం, రూపాయితో పోలిస్తే డాలర్ మరింత బలపడుతున్న నేపథ్యంలో లోహాల ధరలు భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (మే 16) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,57,900కు పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,44,740కు దిగింది. నగరంలో వెండి ధరలు కూడా తగ్గాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.3.05 లక్షలుగా ఉంది.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కూడా బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,61,070గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,47,640కు దిగింది. ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,57,900గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,740గా ఉంది. న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,050 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,44,890 వద్ద ట్రేడవుతోంది. దేశంలోని పలు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.3 లక్షల మార్కు దిగువకు చేరింది. భారత్‌లో నిన్న మేలిమి బంగారం ధర రూ.4,420ల మేర తగ్గగా, వెండి ధరలో రూ.10 వేల మేర కోత పడింది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి:
భారత్‌లో పుంజుకున్న ఎగుమతులు.. 49 నెలల గరిష్ఠానికి చేరిక