Share News

డాలర్‌ @: రూ.96

ABN , Publish Date - May 16 , 2026 | 03:24 AM

భారత కరెన్సీ సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ శుక్రవారం ఒక దశలో 50 పైసలు క్షీణించి రూ.96.14కు చేరుకుంది...

డాలర్‌ @: రూ.96

సరికొత్త జీవితకాల కనిష్ఠానికి రూపీ

  • ఒకదశలో రూ.96.14కు చేరిన మారకం విలువ

  • చివరికి రూ.95.81 వద్ద ముగింపు..ఇది ఆల్‌టైం కనిష్ఠ క్లోజింగ్‌ కూడా..

  • క్రూడ్‌ షాక్‌, ద్రవ్యోల్బణం భయాలే కారణం

ముంబై: భారత కరెన్సీ సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ శుక్రవారం ఒక దశలో 50 పైసలు క్షీణించి రూ.96.14కు చేరుకుంది. డాలర్‌-రూపీ ఎక్స్ఛేంజ్‌ రేటు రూ.96 మార్క్‌ను దాటడం ఇదే తొలిసారి. అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరగడం, డాలర్‌ బలోపేతం, దేశీయం గా ధరలు మరింత ఎగబాకవచ్చన్న ఆందోళనలు ఇందుకు ప్రధాన కారణమయ్యాయి. అయితే, ఆర్‌బీఐ జోక్యంతో రూపాయి మళ్లీ కాస్త కోలుకుంది. దాంతో డాలర్‌తో మారకం రేటు 17 పైసల నష్టంతో రూ.95.81 వద్ద ముగిసింది. ఇది కనిష్ఠ ముగింపు స్థాయి కూడా. గురువారం సెషన్‌లో డాలర్‌తో రూపీ మారకం రేటు 2 పైసలు లాభపడి రూ.95.64 వద్ద క్లోజైంది. అంతర్జాతీయంగా ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ ఇండెక్స్‌ 0.34 శాతం పెరిగి 99.15 స్థాయిలో ట్రేడైంది. బ్రెంట్‌ ముడి చమురు బ్యారల్‌ ధర ఒక దశ లో 3.14 శాతం పెరిగి 109.04 డాలర్లకు చేరుకుంది.

6 రోజుల్లో 2 శాతం డౌన్‌: గడిచిన 6 ట్రేడింగ్‌ సెషన్లలో డాలర్‌తో రూపాయి మారకం విలువ దాదాపు 2 శాతం క్షీణించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 6 శాతానికి పైగా పతనమైంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, దాంతో చమురు ధరలు 100 డాలర్ల పైకి ఎగబాకడం, మన ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడుల నిరవధిక ఉపసంహరణ, ద్రవ్యోల్బణ భయాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రవాహం తగ్గడం వంటి అంశాలు మన కరెన్సీపై ఒత్తిడి పెంచాయని ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. కాగా రూపాయిపై ఒత్తిడి కొనసాగనుందని మిరే అసెట్‌ షేర్‌ఖాన్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ అనూజ్‌ చౌదరి అన్నారు. మున్ముందు సెషన్లలో డాలర్‌-రూపీ ఎక్స్ఛేంజ్‌ రేటు రూ.95.60-96.20 శ్రేణిలో కదలాడవచ్చన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

కేంద్రం కీలక నిర్ణయం.. పసిడి దిగుమతిపై పరిమితి

42 నెలల గరిష్ఠానికి టోకు ధరల ద్రవ్యోల్బణం

Updated Date - May 16 , 2026 | 03:24 AM