Share News

42 నెలల గరిష్ఠానికి టోకు ధరల ద్రవ్యోల్బణం

ABN , Publish Date - May 15 , 2026 | 05:24 AM

టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) భారీగా పెరిగింది. ఏప్రిల్‌లో 8.30 శాతానికి చేరుకుంది. ఇది 42 నెలల గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా...

42 నెలల గరిష్ఠానికి టోకు ధరల ద్రవ్యోల్బణం

ఏప్రిల్‌లో 8.3 శాతంగా నమోదు

న్యూఢిల్లీ: టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) భారీగా పెరిగింది. ఏప్రిల్‌లో 8.30 శాతానికి చేరుకుంది. ఇది 42 నెలల గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇంధన ధరల్లో పెరుగుదల టోకు ధరల ద్రవ్యోల్బణం దూసుకుపోవడానికి దారితీసింది. మార్చిలో ఈ ద్రవ్యోల్బణం 3.88 శాతంగా ఉండగా.. గత ఏడాది ఏప్రిల్‌లో 0.85 శాతంగా ఉంది. ఇంధనం, విద్యుత్‌, క్రూడ్‌ పెట్రోలియం ధరల్లో పెరుగుదల ద్రవ్యోల్బణం పరుగునకు కారణమయ్యాయి. ఇంధనం, విద్యుత్‌లో డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో ఏకంగా 24.71 శాతానికి పెరిగింది. మార్చి నెలలో ఇది 1.05 శాతంగా ఉంది. క్రూడ్‌ పెట్రోలియంలో ద్రవ్యోల్బణం మార్చిలో 51.5 శాతం ఉండగా.. ఏప్రిల్‌లో 88.06 శాతానికి ఎగబాకింది. 2021 అక్టోబరు నుంచి చూస్తే ఇదే అత్యధికం. కాగా ఏప్రిల్‌లో ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 12.18 శాతానికి పెరిగింది.

ఈ వార్తలు కూడా చదవండి...

టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక

సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్

పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా

Read Latest Telangana News And AP News And International News

Updated Date - May 15 , 2026 | 05:24 AM