టమోటా కిలో రూ.20
ABN , Publish Date - Apr 22 , 2026 | 01:31 PM
అనంతపురం జిల్లాలోని కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో కిలో టమోటా గరిష్ఠంగా రూ.20తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు ఇన్‌చార్జ్ కార్యదర్శి రూప్‌కుమార్ తెలిపారు.
అనంతపురం: అనంతపురం జిల్లాలోని కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో కిలో టమోటా గరిష్ఠంగా రూ.20తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు ఇన్‌చార్జ్ కార్యదర్శి రూప్‌కుమార్ తెలిపారు. మంగళవారం మార్కెట్‌కు 25 టన్నుల టమోటా కాయలు వచ్చాయని అన్నారు. కిలో సరాసరి ధర రూ.13, కనిష్ఠ ధర రూ.8 పలికినట్లు ఆయన పేర్కొన్నారు.

చీనీ టన్ను రూ.40వేలు
అనంతపురం: అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో చీనీ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వారం రోజులుగా ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గత వారంలో టన్ను గరిష్ఠ ధర రూ.30వేల వరకు పలికాయి. రెండు రోజులుగా ధరలు మరింత పెరిగాయి. సోమవారం గరిష్ఠ ధర రూ.36వేలు పలికింది. మంగళవారం రూ.40వేలకు చేరింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మార్కెట్‌కు 525 టన్నుల కాయలు వచ్చాయి. సరాసరి ధర రూ. 26 వేలతో అమ్ముడుపోగా.. కనిష్ఠ ధర రూ.15వేలు పలికాయి. ధరల పెరుగుదలతో చీనీ రైతులకు కొంత ఊరట లభిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
పల్నాడు జిల్లాలో నాటు బాంబుల కలకలం
అమరావతి పనులకు వేగంగ ఇసుక, కంకర
Read Latest Telangana News and National News