Share News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

ABN , Publish Date - Apr 22 , 2026 | 12:30 PM

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత
Nadendla Bhaskara Rao

హైదరాబాద్, ఏప్రిల్ 22: మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నాదెండ్ల భాస్కరరావు గత ఆరు నెలలుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. 20 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాదెండ్ల.. ఆరోగ్యం మరింత క్షీణించడంతో కన్నుమూశారు.


1978లో ఎమ్మెల్యేగా..

నాదెండ్ల భాస్కరరావు 1935 జూన్ 23న గుంటూరులో జన్మించారు. 1978లో విజయవాడ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చెన్నారెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.1984 ఆగష్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకూ కేవలం 31 రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో అత్యల్పకాలం పదవిలో ఉన్న సీఎంగా నాదెండ్ల నిలిచారు.


1998లో ఖమ్మం నుంచి ఎంపీగా..

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నాదెండ్ల 1989లో తెనాలి నుంచి పోటీ చేసి అన్నాబత్తుని సత్యనారాయణపై ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. నాదెండ్ల భాస్కర రావు మృతిపట్ల పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రేపు(గురువారం) సాయంత్రం 4 గంటలకు పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.


ఇవి కూడా చదవండి..

తప్పు చేసిన వారు తప్పించుకోలేరు: ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్

ఎవరు ఔనన్నా కాదన్నా.. కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం: హరీశ్ రావు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 22 , 2026 | 03:47 PM