Share News

తప్పు చేసిన వారు తప్పించుకోలేరు: ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్

ABN , Publish Date - Apr 22 , 2026 | 11:46 AM

ఘోష్ కమిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పుతో తమకేదో లాభం చేకూరిందని బీఆర్ఎస్ భావిస్తోందని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తెలిపారు. బీఆర్ఎస్ నేతలు అప్పుడే చంకలు గుద్దుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు.

తప్పు చేసిన వారు తప్పించుకోలేరు: ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్
Adayanki Dayakar

హైదరాబాద్, ఏప్రిల్ 22: కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు తీర్పుతో తమకేదో లాభం చేకూరిందని బీఆర్ఎస్ భావిస్తోందన్నారు. బీఆర్ఎస్ నేతలు అప్పుడే చంకలు గుద్దుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. పీసీ ఘోష్ కమిషన్ రాజ్యాంగబద్ధమే అని కోర్టు చెప్పిందని అన్నారు. తాత్కాలికంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మాత్రమే చెప్పిందని తెలిపారు. సీబీఐ నివేదిక వస్తుందని... అప్పుడు అసలు నిజం తెలుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.


తాత్కాలిక రిపోర్ట్‌ను చూసి ఫైనల్ రిపోర్ట్ అని బీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నట్టున్నారని అద్దంకి దయాకర్ తెలిపారు. త్వరలోనే బీఆర్ఎస్ భాగోతం బయటపడుతుందన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీలో ప్రదక్షిణలు చేస్తున్నారని అర్థమవుతోందని తెలిపారు. బీజేపీతో కలిస్తే తమ తప్పులు మాఫీ అయిపోతాయని భావిస్తున్నట్టున్నారని.. కానీ తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

మద్యం మత్తులో తల్లితో గొడవ.. అడ్డుకోబోయిన తండ్రిని

కాళేశ్వరంపై ఘోష్ కమిషన్‌ నివేదికను నిలిపివేసిన తెలంగాణ హైకోర్టు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 22 , 2026 | 11:50 AM