మద్యం మత్తులో తల్లితో గొడవ.. అడ్డుకోబోయిన తండ్రిని
ABN , Publish Date - Apr 22 , 2026 | 10:28 AM
నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నవీపేట మండలం మాన్ సింగ్ తండాలో కన్న తండ్రిని కొడుకు కిరాతంగా హత్య చేశాడు.
నిజామాబాద్, ఏప్రిల్ 22: నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నవీపేట మండలం మాన్ సింగ్ తండాలో కన్న తండ్రిని కొడుకు కిరాతంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రాజేష్ అనే యువకుడు మద్యం మత్తులో తన తల్లితో గొడవకు దిగాడు. ఈ సమయంలో పరిస్థితిని అదుపు చేసేందుకు అడ్డుగా వచ్చిన తండ్రి మురళిపై రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కోపోద్రిక్తుడైన రాజేష్ సమీపంలో ఉన్న బండరాయితో తండ్రి మురళిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మురళిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మురళి మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ధనుంజయ్, వాసుదేవ రెడ్డి ప్రాసిక్యూషన్‌కు అనుమతివ్వండి.. సిట్ లేఖలు
డ్రైవర్ హత్య కేసులో సాక్షులకు బెదరింపులు.. అనంత బాబు కోసం పోలీసుల గాలింపు
Read Latest Telangana News And Telugu News