ధనుంజయ్, వాసుదేవ రెడ్డి ప్రాసిక్యూషన్‌కు అనుమతివ్వండి.. సిట్ లేఖలు
ABN , Publish Date - Apr 22 , 2026 | 09:31 AM
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఐఏఎస్ మాజీ అధికారి ధనుంజయ రెడ్డి, ఐఆర్‌టీఎస్ అధికారి వాసుదేవ రెడ్డిని ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయా విభాగాలకు సిట్ లేఖలు రాసింది.
అమరావతి, ఏప్రిల్ 22: ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఐఏఎస్ మాజీ అధికారి ధనుంజయ రెడ్డి, ఐఆర్‌టీఎస్ అధికారి వాసుదేవ రెడ్డిని ప్రాసిక్యూషన్‌కు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయా విభాగాలకు సిట్ లేఖలు రాసింది. లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే వీరిరువురినీ సిట్ అధికారులు అరెస్ట్ చేయగా... ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయ్యారు. దీంతో ధనుంజయ్ రెడ్డిని ప్రాసిక్యూషన్ చేసేందుకు డీఓపీటీకి, వాసుదేవ రెడ్డిని ప్రాసిక్యూషన్ చేసేందుకు ఐఆర్‌టీఎస్‌కు లేఖ రాశారు సిట్ అధికారులు.
అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్లు కింద న్యాయవిచారణ జరపాలంటే సంబంధిత విభాగాల నుంచి అనుమతి అవసరమని సిట్ ఆఫీసర్స్ చెబుతున్నారు. ఇరువురినీ ప్రాసిక్యూషన్ చేసేందుకు ఆయా విభాగాలకు అధికారులు లేఖలను పంపించారు. లిక్కర్ కుంభకోణంలో వాసుదేవరెడ్డి ఏ2 నిందితుడిగా, ధనుంజయ్ రెడ్డి ఏ 31 నిందితుడిగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి...
‘డబుల్ ఇంజన్’తోనే బుల్లెట్ వేగంతో అభివృద్ధి!
పల్నాడు జిల్లాలో నాటు బాంబుల కలకలం
Read Latest AP News And Telugu News