ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి..
ABN , Publish Date - Apr 22 , 2026 | 07:11 AM
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వీరవల్లి టోల్‌గేట్ వద్ద 500 మీటర్ల సూచిక బోర్డును కారు ప్రమావదశాత్తూ ఢీకొట్టింది.
తూర్పుగోదావరి జిల్లా: నల్లజర్ల మండలం వీరవల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వీరవల్లి టోల్‌గేట్ వద్ద 500 మీటర్ల సూచిక బోర్డును కారు ప్రమాదవశాత్తూ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఏలూరు నుంచి రాజమహేంద్రవరం వైపునకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.
ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాలను గోపాలపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగిందా లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. కాగా, ఘటన గురించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతి పనులకు వేగంగ ఇసుక, కంకర
నైపుణ్యాభివృద్ధి సలహాదారు సీతా శర్మ రాజీనామా