Share News

నైపుణ్యాభివృద్ధి సలహాదారు సీతా శర్మ రాజీనామా

ABN , Publish Date - Apr 22 , 2026 | 06:21 AM

నైపుణ్యాభివృద్ధి శాఖలో ఇంటర్నేషనల్‌ స్కిల్లింగ్‌ సలహాదారు సీతా శర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఆమోదిస్తూ నైపుణ్యాభివృద్ధి శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

నైపుణ్యాభివృద్ధి సలహాదారు సీతా శర్మ రాజీనామా

అమరావతి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): నైపుణ్యాభివృద్ధి శాఖలో ఇంటర్నేషనల్‌ స్కిల్లింగ్‌ సలహాదారు సీతా శర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఆమోదిస్తూ నైపుణ్యాభివృద్ధి శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. నైపుణ్య కల్పనలో విదేశీ సంస్థలతో సమన్వయం, ఇక్కడి యువతకు అక్కడి అవసరాలపై శిక్షణ అంశాలపై ఆమె పనిచేశారు. 2025 జనవరిలో రెండేళ్ల కాల పరిమితితో ఆమె నియమితులయ్యారు. 2027 జనవరి వరకూ పదవిలో కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ఆమె ముందుగానే రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఉన్నతాధికారులతో సరైన సమన్వయం లేకపోవడం వల్లే ఆమె రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. మొదటి నుంచీ ఆమెకు, ఉన్నతాధికారులకు మధ్య గ్యాప్‌ ఉందనే ప్రచారం జరిగింది. తన ప్రతిపాదనలను అధికారులు తిరస్కరిస్తున్నారని, దీంతో ఇక్కడ పనిచేయడానికి పెద్దగా అవకాశం లేదని కొందరితో ఆమె వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

Updated Date - Apr 22 , 2026 | 06:33 AM