అన్నప్రసాదాల్లో నాణ్యత పెంచండి: దేవాదాయ శాఖ
ABN , Publish Date - Apr 22 , 2026 | 06:13 AM
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో అన్నప్రసాదంలో నాణ్యత పెంచి, తయారీలో అధునాతన టెక్నాలజీని ఉపయోగించాలని దేవదాయ శాఖ సెక్రటరీ హరిజవహల్‌లాల్ ఆదేశించారు.
అమరావతి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో అన్నప్రసాదంలో నాణ్యత పెంచి, తయారీలో అధునాతన టెక్నాలజీని ఉపయోగించాలని దేవదాయ శాఖ సెక్రటరీ హరిజవహల్‌లాల్ ఆదేశించారు. దేవదాయ శాఖలోని ఉన్నతాధికారులు, ఆలయాల ఈవోలతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేవాలయాలకు వచ్చే భక్తులకు కల్పించే సౌకర్యాలపై సంతృప్తి స్థాయిని మరింత పెంచాలని ఆయన చెప్పారు. 80 శాతం సంతృప్తిస్థాయే లక్ష్యంగా పని చేయాలన్నారు. దర్శన ఏర్పాట్లు, అన్నప్రసాదం, ఉచిత ప్రసాదాల వితరణ, మంచినీరు నాణ్యతతో ఇవ్వడంతోపాటు మరుగుదొడ్ల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు.